Hyderabad : అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు..హైదరాబాద్ పోలీసు కమిషనర్ స్పందన
- By Latha Suma Published Date - 04:01 PM, Mon - 6 May 24

Hyderabad CP Kottakota Srinivas Reddy: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) వీడియో మార్ఫింగ్(Video morphing case) పై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి(CP Kottakota Srinivas Reddy) స్పందించారు. ఫేక్ వీడీయోకు సంబంధించిన అంశంలో 27 కేసులు నమోదు చేశామని, ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, వారు షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారని తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
నిందితుల దగ్గరి నుంచి సెల్‌ఫోన్లు, లాప్‌ట్యాప్స్ సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్)కు లేఖ రాసి… పూర్తి వివరాలు సమీకరించినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులను కూడా తాము కలిశామన్నారు. ఇక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు అడిగారని… వారికి కావాల్సిన వివరాలు అందించినట్లు చెప్పారు. కేసు దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు.
Read Also: Salaar 2 : సలార్ 2 షూటింగ్ గురించి.. యాక్టర్ షఫీ ఇంటరెస్టింగ్ పోస్ట్..
ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా సీపీ స్పందించారు. కేసు దర్యాఫ్తు సాగుతోందని, అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తామన్నారు. అందుకు సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో నిందితులు ఎన్ని ఆధారాలు ధ్వంసం చేసినా తాము కష్టపడి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.