Kavitha Birthday Special : కవితపై షార్ట్ ఫిలిం..ఫిదా అవుతున్న పార్టీ శ్రేణులు
Kavitha Birthday Special : నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్న గౌడ్, మట్టు చౌదరి కలిసి ఒక ప్రత్యేక షార్ట్ ఫిలిం ను రూపొందించారు
- By Sudheer Published Date - 09:38 PM, Wed - 12 March 25

Kavitha Birthday Special : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం (Kavitha Birthday 2025) సందర్భంగా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్న గౌడ్, మట్టు చౌదరి కలిసి ఒక ప్రత్యేక షార్ట్ ఫిలిం ను రూపొందించారు. నాలుగు నిమిషాల నిడివి గల ఈ ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునేలా రూపొందించబడింది. ప్రత్యేకంగా దక్షిణ కన్నడ జిల్లాలో చిత్రీకరించిన ఈ వీడియోలో ప్రకృతి సోయగాలు, నదులు, సెలయేరులు, పడవ విన్యాసాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. సోషల్ మీడియాలో ఈ లఘుచిత్రం విపరీతంగా వైరల్ అవుతూ, పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది.
Fact Check : తెలంగాణలోని ఆ ఆలయం నుంచి కాశీకి భూగర్భ మార్గం ?
“హ్యాపీ బర్త్‌డే కవితక్క” (Happy birthday Kavitakka) అనే శీర్షికతో విడుదలైన ఈ వీడియోలో గులాబీ జెండాలను ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల మధ్య రెపరెపలాడించటం విశేషం. ప్రతి సీన్ ఎంతో జాగ్రత్తగా, ఆకర్షణీయంగా చిత్రీకరించబడింది. కవితకు అభిమానంగా, ఆమె నాయకత్వాన్ని ప్రశంసిస్తూ రూపొందించిన ఈ లఘుచిత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచింది. కేవలం జన్మదిన శుభాకాంక్షలకే కాకుండా, పార్టీ ఆవేశాన్ని, ఐక్యతను, కవిత సేవలను ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ వీడియో రూపొందించినట్లు నాయకులు తెలిపారు.
Syed Abid Ali: భారత క్రికెట్‌లో విషాదం.. దిగ్గజ ఆల్ రౌండర్ కన్నుమూత
ఈ లఘుచిత్రాన్ని బుధవారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్‌లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు మేడే రాజీవ్ సాగర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ముఠా జయసింహ తదితరులు హాజరై లఘుచిత్రాన్ని అభినందించారు. ప్రదర్శన అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రత్యేక వీడియో కేవలం ఒక లఘుచిత్రంగా కాకుండా, కవిత నాయకత్వాన్ని మరోసారి ప్రజల్లో చాటిచెప్పే ఓ గొప్ప కార్యక్రమంగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.