HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >76 Years For Veera Bairanpally Revolt This Is Special Story

Bairanpally : బైరాన్‌పల్లిలో రజాకార్ల నరమేధానికి నేటితో 76 ఏళ్లు

మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. కానీ నిజాం నవాబు నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న విమోచనం లభించింది.

  • Author : Pasha Date : 27-08-2024 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bairanpally Martyrs Remembrance Day 2024

Bairanpally : బైరాన్‌పల్లి.. యావత్ తెలంగాణకు గర్వకారణం. ఈ పేరు వినగానే తెలంగాణ గడ్డ పులకించిపోతుంది. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలో బైరాన్‌పల్లి గ్రామం ఉంది. 1948 ఆగస్టు 27న ఈ పల్లెలో రజాకార్లు దారుణ నరమేధానికి పాల్పడ్డారు. ఆనాడు రజాకార్లపై వీరోచితంగా పోరాడి ఎంతోమంది బైరాన్‌పల్లి ముద్దుబిడ్డలు అమరులయ్యారు. వారి వీరోచిత పోరాటానికి నేటితో 76 ఏళ్లు పూర్తయ్యాయి. ఈసందర్భంగా కథనమిది.

We’re now on WhatsApp. Click to Join

  • మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. కానీ నిజాం నవాబు నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న విమోచనం లభించింది.
  • అంటే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా 13 నెలల పాటు తెలంగాణ ప్రాంతం నిజాం నవాబు కబ్జాలోనే ఉండిపోయింది.
  • నిజాం నవాబుకు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు, కూలీలు, కార్మికులు వీరోచిత సాయుధ పోరాటం చేశారు.
  • ఈ పోరాటంలో 1948 ఆగస్టు 27న జరిగిన బైరాన్‌పల్లి ఘటన ఎంతో చారిత్రాత్మకమైనది.
  • ఆ రోజున బైరాన్‌పల్లి గ్రామంలో రజాకార్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఊరికి చెందిన 96 మంది యోధులను ఒకే వరుసలో నిలబెట్టి కాల్చి చంపారు. నిజాం సైనిక అధిపతి ఖాసీం రజ్వి ఆదేశాలతో ఈ కాల్పులు జరిపారు.
  • రజకార్లు ఆనాడు తెలంగాణలోని గ్రామాలను లూటీ చేసేవారు.

Also Read :KTR : హైదరాబాద్ డెవలప్‌మెంట్‌‌ను విస్మరిస్తారా ? ఎస్‌ఆర్‌డీపీ పనుల సంగతేంటి ? : కేటీఆర్

  • ఈక్రమంలోనే సిద్దిపేట జిల్లాలోని మద్దూరు, లద్నూరు, సలాఖపూర్, రేబర్తి గ్రామాలను రజాకార్లు తమ కేంద్రాలుగా వాడుకునేవారు. ఆ గ్రామాల్లో ఉంటూ సమీప పల్లెలపై దాడులకు తెగబడేవారు. ప్రజల సంపదను దోచుకునేవారు.
  • రజాకార్లను ఎదిరించేందుకు ఆనాడు ఎంతోమంది గ్రామీణ యువత కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డారు.
  • బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట ప్రాంతాల్లో యువకుల  రక్షక దళాలు పనిచేశాయి. వీటికి కేంద్రంగా బైరాన్‌పల్లి ఉండేది.
  • 1948 ఆగస్టులో రజాకార్లు లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలపై దాడి చేసి సొమ్మును దోచుకున్నారు.
  • ఆ సంపదను దోచుకొని వెళ్తుండగా బైరాన్‌పల్లి(Bairanpally) సమీపంలోకి రాగానే సమరయోధులు దూబూరి రాంరెడ్డి, ముకుందరెడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలోని రక్షణ గెరిల్లా దళాలు దాడిచేశాయి. దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నాయి.
  • ఈ ఘటనతో బైరాన్‌పల్లి గ్రామంపై రజాకార్లు  కసి పెంచుకున్నారు.
  • దీంతో బైరాన్‌పల్లి గ్రామస్థులు చుట్టూ గోడ ఏర్పాటు చేసి మధ్యలో ఉన్న ఎత్తయిన బురుజును స్థావరంగా చేసుకుని ఊరిని రక్షించుకున్నారు.
  • రజాకార్లు రెండు సార్లు ఈ ఊరిపై దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు.
  • ఆ దళాల్లో పనిచేసే యువతను భయపెట్టే లక్ష్యంతో 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో 96 మంది యోధులను ఒకే వరుసలో నిలబెట్టి కాల్చి చంపారు.
  • ఆగస్టు 27న వేకువజామున  బైరాన్‌పల్లి గ్రామస్తులు నిద్రిస్తుండగా, అప్పటి డిప్యూటీ కలెక్టరు హషీం 500 మంది సైన్యంతో ఊరిపై దాడి చేశారు. సైనికులు గ్రామంలోకి చొరబడి అందరినీ కాల్చి చంపారు.
  • బురుజుపై తలదాచుకున్న 40 మందిని, పలుచోట్ల దొరికిన 56 మంది యువకులను బంధించి ఊరి బయటకు ఈడ్చుకుంటూ వెళ్లి కాల్చి చంపారు.

Also Read :Telegram: కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. భార‌త్‌లో టెలిగ్రామ్ నిషేధం..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bairanpally
  • Bairanpally Martyrs Remembrance Day
  • telangana

Related News

Tgpsc Group 3 Results

గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.మొత్తం 1,388 పోస్టులకు గాను ప్రస్తుతం 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • New Sarpanches

    తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

Latest News

  • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd