Telegram: కేంద్రం కీలక నిర్ణయం.. భారత్‌లో టెలిగ్రామ్ నిషేధం..?
టెలిగ్రామ్‌లో జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలపై హోం మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.
- By Gopichand Published Date - 09:46 AM, Tue - 27 August 24

Telegram: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) పెద్ద సమస్యలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ యాప్ దోపిడీ, జూదం వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందనే ఆరోపణలపై భారత ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణలో ఈ ఆరోపణలు నిజమని తేలితే టెలిగ్రామ్‌ను భారతదేశంలో నిషేధించే అవకాశం ఉంది. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, CEO పావెల్ దురోవ్ అరెస్టు తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. టెలిగ్రామ్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది యాక్టివ్ యూజర్లు ఉన్న విషయం మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో ఇది మెటా అనుబంధ సంస్థలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మస్క్ ట్విట్టర్ (ఎక్స్)కు గట్టి పోటి ఇస్తున్న విషయం తెలిసిందే.
టెలిగ్రామ్‌లో జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలపై హోం మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను ఫ్రాన్స్‌లో అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రమైంది. టెలిగ్రామ్ నేరాన్ని ప్రోత్సహిస్తోందని ఫ్రెంచ్ అధికారులు ఆరోపించారు. ఇదే సమయంలో ఇటీవల యుజిసి-నీట్ పేపర్ లీక్ టెలిగ్రామ్‌లో విక్రయించబడిన సంఘటన ఈ విషయాన్ని మరింత తీవ్రం చేసింది. టెలిగ్రామ్‌పై ప్రభుత్వం విచారణను ముమ్మరం చేయడానికి ఇది కూడా ఒక కారణం. UGC-NEET పేపర్‌ను ఈ ప్లాట్‌ఫారమ్‌లో రూ. 5,000, రూ. 10,000 మధ్య విక్రయించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Spain Record: టీ20ల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన స్పెయిన్ జట్టు..!
ఎందుకు నిషేధించవచ్చు?
దోపిడి, జూదంచ ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ ఉపయోగించబడుతోంది. ఇది మాత్రమే కాదు టెలిగ్రామ్‌లో పిల్లల లైంగిక వేధింపుల కంటెంట్ కూడా కనుగొనబడింది. అదే సమయంలో ఇప్పుడు భారత ప్రభుత్వం టెలిగ్రామ్‌పై తన పట్టును బలోపేతం చేసుకోవాలనుకుంటోంది.
We’re now on WhatsApp. Click to Join.
దీనిపై టెలిగ్రామ్ ఏం చెబుతోంది?
మరోవైపు టెలిగ్రామ్ భారతీయ చట్టాలను అనుసరిస్తుందని, ప్రభుత్వం అన్ని షరతులను అంగీకరించిందని చెప్పారు. కంపెనీ ఒక నోడల్ అధికారిని, చీఫ్ కంప్లైయన్స్ అధికారిని కూడా నియమించింది. విచారణ ఫలితాల ఆధారంగా భారత్‌లో టెలిగ్రామ్‌ను నిషేధించాలా వద్దా అనేది నిర్ణయించనున్నారు. దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే భారతదేశంలో టెలిగ్రామ్ పనిచేయడం కష్టమవుతుంది.