HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >17000 Traffic Challans Pending On Telangana Police Vehicles Total Outstanding Is Over Rs 60 Lakhs

Police Vehicles Vs Challans : పోలీసు వాహనాలపై 17,391 పెండింగ్‌ ఛలాన్లు.. అర కోటికిపైనే బకాయీ

తెలంగాణలో పోలీసు సిబ్బంది, అధికారులు వినియోగించే వాహనాలు సాధారణంగా తెలంగాణ డీజీపీ(Police Vehicles Vs Challans) పేరిట రిజిస్టర్ అయి ఉంటాయి.

  • By Pasha Published Date - 01:16 PM, Sat - 3 May 25
  • daily-hunt
Telangana Police Vehicles Vs Traffic challans 2025

Police Vehicles Vs Challans : ట్రాఫిక్ ఛలాన్లు.. ఈ పేరు వినగానే సామాన్యులకు దడ మొదలవుతుంది.  ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించగానే భారీగా ఫైన్లు పడతాయి. వాటికి సంబంధించిన ఛలాన్లు జారీ అవుతాయి. వాటిని సకాలంలో కట్టకుంటే ఏళ్ల తరబడి పేరుకుపోతాయి. చివరకు వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. ట్రాఫిక్ నియమాలను పాటించే వారికి ఈ భయాలు, ఆందోళనలు ఉండవు. అయితే ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసే జాబితాలో సామాన్యులతో పాటు కొందరు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. తాజాగా బయటికి వచ్చిన సమాచారాన్ని చూస్తే మీరు కూడా అవాక్కవుతారు.

Also Read :Nuclear Strike : పాక్ అణ్వాయుధం ప్రయోగిస్తే.. భారత్ ఇలా అడ్డుకుంటుంది

17,391 పెండింగ్‌ ఛలాన్లు  

తెలంగాణలో పోలీసు సిబ్బంది, అధికారులు వినియోగించే వాహనాలు సాధారణంగా తెలంగాణ డీజీపీ(Police Vehicles Vs Challans) పేరిట రిజిస్టర్ అయి ఉంటాయి. డీజీపీ పేరిట ఉన్న పోలీసు వాహనాలపై ఎన్ని ట్రాఫిక్ ఛలాన్లు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసా ? ప్రస్తుతం ఆ వెహికల్స్‌పై 17,391 పెండింగ్‌ ఛలాన్లు  ఉన్నాయి. వీటి కింద దాదాపు రూ.68,67,885 చెల్లించాల్సి ఉంది. హైదరాబాద్‌‌కు చెందిన లోకేంద్రసింగ్‌ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేయగా విస్మయపరిచే ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసు వాహనాలతో జరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏ రేంజులో ఉన్నాయో దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు.  ట్రాఫిక్‌ రూల్స్ తమకు పట్టవన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే ఇంతగా ఛలాన్లు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తేనే.. భవిష్యత్తులో పోలీసు వాహనాల నిర్వహణ తీరు ట్రాఫిక్ రూల్స్‌కు అనుగుణంగా ఉంటుంది.

Also Read :Miss World 2025 : మిస్ వరల్డ్ 2025 పోటీలు.. ఏయే రోజు ఏమేం చేస్తారు ?

లోకేంద్రసింగ్‌ ట్వీట్.. ఛలాన్లపై నెటిజన్లు భగ్గు 

ఈ అంశంపై లోకేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రజలకు పోలీసులు ఆదర్శంగా ఉండాలి. వాళ్లే పలుచోట్ల ట్రాఫిక్ రూల్స్‌ను దారుణంగా బ్రేక్ చేస్తుండటం బాధాకరం. ఈవివరాలను నేను సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా సేకరించాను’’ అని చెప్పారు.  ‘‘చట్టాన్ని అమలు చేసే అధికారుల పారదర్శకత, జవాబుదారీతనంపై నాకు నమ్మకం ఉంది. భవిష్యత్తులో పోలీసులు ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘనలకు పాల్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.  ఈమేరకు వివరాలతో లోకేంద్రసింగ్‌‌‌‌ చేసిన ట్వీట్‌‌‌‌పై నెటిజన్లు స్పందించారు. ‘‘పెండింగ్‌‌‌‌ చలాన్ల చెల్లింపుపై సొంత డిపార్ట్​మెంట్​ వాళ్లు పెట్టిన డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్లను వీళ్లు మర్చిపోయినట్టు కనిపిస్తున్నది. ఇలాంటి పెండింగ్ చలాన్ల వాహనాలను కూడా  ప్రయాణం మధ్యలో ఆపి, మిగతా వారందరికీ చేస్తున్నట్లుగా, డబ్బు చెల్లించిన తర్వాతే ముందుకు అనుమతించాలి’’ అని ఓ నెటిజన్ కోరడం గమనార్హం.  “అధికారులు చేసే ఉల్లంఘనలకు ఎంవీ చట్టం 2019లోని 210(బీ) ప్రకారం ఫైన్​ విధించాలి. దీని ప్రకారం జరిమానాకు రెట్టింపు అంటే మొత్తం రూ 1.37 కోట్లు అవుతుంది’’ అని మరొక నెటిజన్‌‌‌‌ కామెంట్ పెట్టాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Police Vehicles
  • Police Vehicles Challans
  • Police Vehicles Vs Challans
  • telangana
  • telangana police
  • Telangana Traffic Challans
  • Traffic Challans

Related News

Consequences of Kaleshwaram debts.. Illegal construction in Medigadda: Minister Uttam makes sensational allegations

Grain Purchases : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – ఉత్తమ్ కుమార్

Grain Purchases : సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, సీఎస్ రామకృష్ణారావుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

  • BRS

    BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అక్రమాలపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు!

  • Ande Sri Cm Revanth

    Ande Sri: అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు – సీఎం రేవంత్

  • Cm Revanth Request

    2029 Assembly Elections : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్స్ – సీఎం రేవంత్

  • Private Colleges

    Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

Latest News

  • Jubilee Hills By-Election 2025: పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం

  • Delhi Bomb Blast : ఆత్మాహుతి దాడే! బలం చేకూరుస్తున్న ఆధారాలు

  • CII Summit : CII సదస్సుకు ముస్తాబవుతున్న విశాఖ – లోకేశ్

  • Delhi Bomb Blast : అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష

  • Pak Cricketer Naseem Shah : పాక్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు

Trending News

    • Gold Prices: మ‌ళ్లీ పెరిగిన ధ‌ర‌లు.. బంగారం కొనుగోలు చేయ‌టానికి ఇదే స‌రైన స‌మ‌యమా?

    • IPL 2026 Auction: ఈసారి ఐపీఎల్ 2026 వేలం ఎక్క‌డో తెలుసా?

    • IPL Trade: ఐపీఎల్‌లో అతిపెద్ద ట్రేడ్.. రాజ‌స్థాన్ నుంచి సంజూ, చెన్నై నుంచి జ‌డేజా!

    • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd