HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Miss World 2025 Competitions In Telangana Full Schedule Is Here

Miss World 2025 : మిస్ వరల్డ్ 2025 పోటీలు.. ఏయే రోజు ఏమేం చేస్తారు ?

‘‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణ వైపే’’ అనే నినాదంతో ఈ ఈవెంట్స్‌ను(Miss World 2025) నిర్వహించనున్నారు.

  • By Pasha Published Date - 11:02 AM, Sat - 3 May 25
  • daily-hunt
Miss World 2025 Competitions Pakistani Girls Hyderabad Telangana

Miss World 2025  : తెలంగాణ‌ రాష్ట్రంలోని హైదరాబాద్ వేదికగా మే 7 నుంచి 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరగనున్నాయి.మే 31 వరకు ఈ పోటీలు కొనసాగుతాయి. వీటిలో 120కిపైగా దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్స్ వేదికగా తెలంగాణ కల్చర్, హెరిటేజ్, సంప్రదాయాలు, చరిత్ర, పర్యాటక ప్రాంతాలు, మెడికల్ టూరిజం, సేఫ్టీ టూరిజంలను  ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.  ‘‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణ వైపే’’ అనే నినాదంతో ఈ ఈవెంట్స్‌ను(Miss World 2025) నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా మే 12 నుంచి  మే 31 వరకు కార్యక్రమాల షెడ్యూల్‌ను రెడీ చేశారు.ఆ వివరాలను చూద్దాం..

Also Read :Repairability Index : ఫోన్లు, ట్యాబ్‌ల‌కు ‘రిపేరబిలిటీ ఇండెక్స్‌’.. మనకు లాభమేంటి ?

మిస్ వరల్డ్ 2025 షెడ్యూల్ ఇదీ..

మే 12న

  • నాగార్జునసాగర్‌లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును, బుద్ధిష్ట్ థీమ్ పార్కును ప్రపంచానికి తెలియజేసేలా పర్యటన ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే అందాల భామలు బుద్ధవనం ప్రాజెక్టును సందర్శిస్తారు.
  • హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేలా చార్మినార్ , లాడ్ బజార్‌లలో అందాల భామలు ‘హెరిటేజ్ వాక్’ నిర్వహిస్తారు.

మే 13న

  • హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌ను అందాల భామలు సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌ను చూస్తారు.

మే 14న

  • గ్రూప్ 1 కేటగిరీలో ఉన్న మిస్ వరల్డ్ పోటీదారులు చారిత్రక, ఆధ్యాత్మిక నగరం వరంగల్‌లోని వేయి స్థంభాల గుడి, వరంగల్ పోర్ట్‌లను సందర్శిస్తారు.
  • గ్రూప్ 2 కేటగిరీలో ఉన్న మిస్ వరల్డ్ పోటీదారులు  యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ పేరిణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు.

మే 15న 

  • గ్రూప్ 1 కేటగిరీలోని మిస్ వరల్డ్ పోటీదారులు యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు.
  • గ్రూప్ 2 కేటగిరీలోని మిస్ వరల్డ్ పోటీదారులు హ్యాండ్లూమ్ ఎక్స్‌పీరియన్సల్ టూర్‌లో భాగంగా పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని, ప్రదర్శనను తిలకిస్తారు.

Also Read :Vehicle Driving Test : డ్రైవింగ్‌ టెస్ట్ మరింత టఫ్.. ఇక ‘సిమ్యులేటర్‌’పైనా నెగ్గాల్సిందే

మే 16న

  • వివిధ దేశాల రోగులను హైదరాబాద్‌కు ఆకర్షించే ఉద్దేశంతో నగరంలోని ఏఐజీ హాస్పిటల్‌లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంటుకు గ్రూప్ 1 కేటగిరీ మిస్ వరల్డ్ పోటీదారులు హాజరవుతారు. ఆధునిక ఆస్పత్రుల ప్రత్యేకతలను వారికి వివరిస్తారు.
  • గ్రూప్  2 కేటగిరీలోని పోటీదారులు మహబూబ్ నగర్‌లోని పిల్లలమర్రి వృక్షాన్ని సందర్శిస్తారు.
  • గ్రూప్ 2 కేటగిరీలోని పోటీదారులు మే 16న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని ఎక్స్పీరియన్ ఎకో పార్కును సందర్శిస్తారు.

మే 17న 

  • మిస్ వరల్డ్ పోటీదారులు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీలలో పాల్గొంటారు.
  • ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శిస్తారు.

మే 18న 

  • మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శిస్తారు. పౌరుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకుంటారు. ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనీషియేటివ్స్‌ను పరిశీలిస్తారు.
  • మిస్ వరల్డ్ పోటీదారులకు తెలంగాణ రాష్ట్ర గ్రోత్, చరిత్రను తెలియజేస్తారు. ట్యాంక్ బండ్‌పై ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే – ఫండే కార్నివాల్‌ను సందర్శిస్తారు.

మే 20న 

  • మిస్ వరల్డ్ పోటీదారులను కాంటినెంటల్ క్లస్టర్ ఆధారంగా స్ట్రీమ్ లైన్ చేసేందుకు రీజియన్ స్పెసిఫిక్ ఫాస్ట్ ట్రాక్ సెలెక్షన్స్‌ను నిర్వహిస్తారు.
  • ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు గ్రూప్ 1 కేటగిరీ అందాల భామలు హాజరవుతారు.

మే 21న 

  • గ్రూప్ 2 కేటగిరీ పోటీదారులు శిల్పారామంలో తెలంగాణ కళాకారులు నిర్వహించే ఆర్ట్స్ , క్రాఫ్ట్స్ వర్క్ షాప్‌కు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై, తయారీ ప్రక్రియ గురించి తెలుసుకుంటారు.

మే 22న 

  • మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే లో అందాల భామలు పాల్గొంటారు.

మే 23న 

  • హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలే‌లో అందాల భామలు పాల్గొంటారు.

మే 26న 

  • బ్యూటీ విత్ ప్యాషన్ ఈవెంట్‌లో అందాల భామలు పాల్గొంటారు.

మే 31న 

  • మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో అందాల భామలు పాల్గొంటారు. ఛైర్‌ పర్సన్, సీఈఓ జూలియా ఎవెలిన్ మోర్లీకి స్వాగతం పలుకుతారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Miss World
  • Miss World 2025
  • Miss World competitions
  • Miss World Pageant
  • telangana

Related News

Sama Rammohan Reddy

Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

గత పదేళ్లలో కేటీఆర్‌కు, ఆయన తండ్రికి (కేసీఆర్‌కు) సాధ్యం కాని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రెండేళ్లలోపు చేసి చూపించారని ఆయన స్పష్టం చేశారు.

  • Collector Field Visit

    Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!

  • Hyderabad Road Damage

    Congress Govt : తెలంగాణ సర్కార్ కు ప్రజల ప్రాణాలు పోయిన ఫర్వాలేదా..?

  • Hyd Bijapur Road

    HYD -Bijapur Highway : ఇది దారి కాదు..యమలోకానికి రహదారి

  • Bus Accidents Oct 4th

    Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!

Latest News

  • Prithviraj Sukumaran: ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 నుంచి సంచలన అప్‌డేట్!

  • Chikiri Chikiri Song : పెద్ది నీ ‘చికిరి చికిరి’ మతిపోయింది

  • TG Govt : డైలమాలో రేవంత్ సర్కార్..అసలు ఏంజరిగిందంటే !!

  • Shree Charani : శ్రీచరణికి గ్రూప్-1 జాబ్ తో పాటు భారీ నజరానా ప్రకటించిన ఏపీ సర్కార్

  • Jubilee Hills By Election : బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కు – మంత్రి పొన్నం

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd