125 Ft Statue: జయహో అంబేద్కర్.. వరల్డ్ రికార్డ్ లో కెక్కిన మన అంబేద్కర్ విగ్రహం!
హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం పేరు దక్కించుకుంది.
- Author : Balu J
Date : 15-04-2023 - 4:03 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ (Hyderabad) నగరం నడిబొడ్డున అత్యంత ఎత్తైన భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Ambedkar statue) విగ్రహం నిర్మించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసల పరంపర కొనసాగుతుంది. తాజాగా శనివారం హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎక్కింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ (CM KCR) పేరు మీద రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అందించారు ప్రతినిధులు.
హైరెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్థానం పొందటం ఆనందంగా ఉందని మంత్రి (Minister) కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. దేశ, విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెబుతున్నారని వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయిలోనే అంబేద్కర్ విగ్రహం టూరిజం (Tourism) స్పాట్ గా మారుతుందని మంత్రి గుర్తు చేశారు
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞశర్మ, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్, హైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్స్ శ్రీకాంత్, సుమన్ పల్లె పాల్గొన్నారు.
Also Read: Karnataka Congress: కర్నాటక ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ నేతలు!