Karnataka Congress: కర్నాటక ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ నేతలు!
- By Balu J Published Date - 03:48 PM, Sat - 15 April 23

త్వరలో జరగబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ బియోజక వర్గాల పరిశీలకులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏఐసీసీ 5 గురికి అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ లకు అవకాశం ఇచ్చారు. కాగా గతంలో పార్లమెంట్ నియోజక వర్గాలకు పరిశీలకులుగా మాజీ వర్కింగ్ ప్రసిడెంట్స్ కుసుమ కుమార్ మండ్య లోక్ సభ పొన్నం ప్రభాకర్ కు హావేరి, ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్ కోలార్ నియోజక వర్గాలకు పరిశీలకులుగా ఏఐసీసీ నియమించింది.