HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >10 Members Arrest In Dj Harish Kumar Murder Case

Hyderabad : పరువు హత్య కేసులో 10 మంది అరెస్ట్

పరువు హత్యగా అనుమానిస్తున్న డీజే ఆపరేటర్ దేవరకొండ హరీశ్‌కుమార్ (28) హత్య కేసులో పది మందిని పేట్‌బషీరాబాద్

  • Author : Prasad Date : 06-03-2023 - 7:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

పరువు హత్యగా అనుమానిస్తున్న డీజే ఆపరేటర్ దేవరకొండ హరీశ్‌కుమార్ (28) హత్య కేసులో పది మందిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బి. దీంధయాల్ (22), టి. నరేష్ (20), పి.వెంకటేష్ గౌడ్ (20), కె. రోహిత్ సింగ్ (20), జి. అక్షయ్ కుమార్ (22), పి. అనికేత్ (21), కోయల్కర్ మనీష్ (23), బూరే సాయినాథ్ (21), మాతంగి రాజేంద్ర కుమార్ (25), గౌతీనవనితల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.మ‌రో నిందితుడు బి వెంకట్ పరారీలో ఉన్నాడు. అరెస్ట్ చేసిన వారందరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హ‌రీష్ కుమార్, ఓ అమ్మాయి ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కాలని యోచిస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హరీష్‌తో చాటింగ్ చేయడాన్ని గమనించిన బాలిక సోదరుడు దీనదయాళ్ ఆమెను తిట్టి, హెచ్చరించాడు. అయితే ఆ హెచ్చరికను పట్టించుకోకుండా, ఆమె అతనితో చాట్ చేస్తూనే ఉంది. అదే స‌మ‌యంలో పారిపోయి వివాహం చేసుకోవాలని యువ‌తి ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 22న కుమార్‌తో కలిసి పారిపోయిందని పేట్‌బషీరాబాద్‌ సీఐ గౌరీ ప్రశాంత్‌ తెలిపారు. మిత్రుడు రాజేంద్రకుమార్ సహాయంతో పేట్‌బషీరాబాద్‌లోని ఓ ప్రదేశంలో తలదాచుకున్నారు. ఈ విషయం యువ‌తి సోద‌రుడు దీనదయాళ్‌కి తెలిసింది. రాజేంద్రను బెదిరించడంతో హ‌రీష్ కుమార్‌, యువ‌తి ఉన్న ప్ర‌దేశాన్ని దీన‌ద‌యాళ్ గుర్తించాడు. మార్చి 1న, దీనదయాళ్ త‌న స్నేహితుల‌తో క‌లిసి రాజేంద్ర వద్దకు వెళ్లాడు. హ‌రీష్‌, యువ‌తి ఉన్న చోటుకి దీనద‌యాళ్ బృందాన్ని రాజేంద్ర తీసుకెళ్లాడు. అక్క‌డ హ‌రీష్‌ని, యువ‌తిని ప‌ట్టుకున్న దీన‌ద‌యాళ్ ..యువ‌తిని బైక్‌పై ఎక్కించి ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఆ త‌రువాత హ‌రీష్‌ని క‌త్తుల‌తో పొడిచి చంపేసి పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేశారు. ప‌రువు హ‌త్య‌గా భావించిన పోలీసులు ప‌ది మందిని అరెస్ట్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • hyderabad
  • love
  • murder
  • telangana

Related News

Cab

Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌ని మోస‌గించి కార్‌తో దుండ‌గుడు ప‌రారైయ్యాడ‌. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక

    Latest News

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd