Social War : అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ‘సోషల్’ వార్ !
Social War : తెలంగాణ ఎన్నికల వేళ అన్ని పార్టీల అభ్యర్థుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది.
- Author : Pasha
Date : 13-10-2023 - 10:33 IST
Published By : Hashtagu Telugu Desk
Social War : తెలంగాణ ఎన్నికల వేళ అన్ని పార్టీల అభ్యర్థుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, హామీలతో కూడిన పోస్టులతో ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ లు హోరెత్తుతున్నాయి. వాల్ పేపర్స్, వీడియో క్లిప్స్, టెక్ట్స్ మెసేజ్ లతో జనంలోకి వెళ్లేందుకు అందుబాటులో ఉన్న ప్రతీ సోషల్ మీడియా టూల్ ను అభ్యర్థులు సమర్ధంగా వాడుకుంటున్నారు. తమతమ పార్టీల జనాకర్షక హామీలను ముమ్మరంగా జనంలోకి తీసుకెళ్తున్నాయి. దీన్నిబట్టి పార్టీలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాపై ఎంతగా ఆధారపడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వర్క్ కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికి వారుగా సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ మొత్తం యాక్టివిటీని చేసేందుకు లక్షలు ఖర్చు పెట్టి ఆఫీసులను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. డిజిటల్ పొలిటికల్ మార్కెటింగ్ ఏజెన్సీలతో కలిసి ఎన్నికల ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆ ఏజెన్సీలు ఒక్కో నేత నుంచి భారీగానే సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాలను చేపట్టే సంస్థలు ఆకట్టుకునే నినాదాలు, ఆలోచింపజేసే పోస్టులతో కాక పుట్టిస్తున్నాయి. టార్గెటెడ్ ఏరియాల్లో అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచార యాడ్స్ ను కూడా రన్ చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు.. అధికార పక్షం వైఫల్యాలను ఎండగట్టడంపై ఫోకస్ చేస్తుంటే.. అధికార పక్షం అభ్యర్థులు తమ సర్కారు విజయాలను, అందించిన సంక్షేమ పాలనను ప్రజలకు వివరించే ప్రయత్నంలో ఉన్నారు. ఈనేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టింది. అభ్యంతరకరంగా ఉండే యాక్టివిటీని నిలుపుదల చేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు రంగం (Social War) సిద్ధం చేస్తున్నారు.