WhatsApp New Feature : ఇక వాట్సాప్‌లోనే డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్
వాట్సాప్‌లోని డాక్యుమెంట్ షేరింగ్ మెనూలో ఈ ‘‘స్కాన్’’ అనే ఆప్షన్(WhatsApp New Feature) కనిపించనుంది.
- By Pasha Published Date - 05:59 PM, Tue - 24 December 24

WhatsApp New Feature : సాధారణంగా మనం డాక్యుమెంట్లను స్కాన్ చేసేందుకు ప్రత్యేకమైన స్కానింగ్ టూల్స్, యాప్‌లను వాడుతుంటాం. అయితే వాట్సాప్ యూజర్లకు ఇక అలాంటి టూల్స్ అక్కర్లేదు. ఎందుకంటే.. ‘డాక్యుమెంట్ స్కానింగ్’ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. ఈమేరకు వివరాలతో ‘వాబీటా ఇన్ఫో’ ఒక బ్లాగ్ పోస్ట్‌ను ప్రచురించింది. ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలతో ఒక స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. ఎంపిక చేసిన కొందరు యాపిల్ యూజర్లకు ఈ ఫీఛర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసింది. త్వరలోనే మరింత మంది కోసం దీన్ని రిలీజ్ చేయనున్నారు.
Also Read :Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు విశాఖపట్నం నుంచి స్పెషల్ ట్రైన్స్ ఇవే
‘వాబీటా ఇన్ఫో’లో తాజాగా ప్రచురితమైన బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. వాట్సాప్‌లోని డాక్యుమెంట్ షేరింగ్ మెనూలో ఈ ‘‘స్కాన్’’ అనే ఆప్షన్(WhatsApp New Feature) కనిపించనుంది. ఈ ఆప్షన్ సాయంతో కావాల్సిన డాక్యుమెంట్లను ఫోన్‌లోని కెమెరా ద్వారా చాలా వేగంగా స్కాన్ చేయొచ్చు. డాక్యుమెంట్లను స్కాన్ చేసిన తర్వాత .. వాటిని నిశితంగా పరిశీలించేందుకు ‘ప్రివ్యూ’ ఆప్షన్ ఉంటుంది. వాట్సాప్ యూజర్లు ఏవైనా అత్యవసర సమయాల్లో డాక్యుమెంట్లను సెండ్ చేసే క్రమంలో ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. అప్పటికప్పుడు ప్రత్యేకమైన స్కానింగ్ టూల్స్‌ను వాడలేని పరిస్థితుల్లో.. వాట్సాప్‌లోని ఈ ఫీచర్ హెల్ప్ చేస్తుంది. ఫలితంగా వాట్సాప్ యూజర్ల విలువైన సమయం ఆదా అవుతుంది. ప్రత్యేకమైన డాక్యుమెంట్ స్కానింగ్ యాప్‌లను వాడితేే.. స్కాన్ చేసిన తర్వాత ఆయా డాక్యుమెంట్లకు సైజ్, క్వాలిటీని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ పూర్తవడానికి టైం పడుతుంది.
Also Read :Illegal Autism Centres : నకిలీ ఆటిజం థెరపీ కేంద్రాల దందా.. భారీగా ఫీజుల దోపిడీ
ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్
2025 సంవత్సరంలో కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికీ ఈ ఫోన్లు వాడుతున్న వారు అప్‌గ్రేడ్ అయిపోతే బెటర్. వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న ఫోన్ల జాబితాలో.. శాంసంగ్ గెలాక్సీ ఎస్3, మోటో జీ, హెచ్‌టీసీ వన్‌ఎక్స్, హెచ్‌టీసీ వన్ ఎక్స్+, హెచ్‌టీసీ డిజైర్ 500, హెచ్‌టీసీ డిజైర్ 601, శాంసంగ్ గెలాక్సీ నోట్2, శాంసంగ్ గెలాక్సీ ఎస్4 మినీ, మోటో రేజర్ హెచ్‌డీ, మోటో ఈ 2014, ఎల్‌జీ ఆప్టిమస్ జీ, ఎల్‌జీ నెక్సస్ 4, ఎల్‌జీ జీ2 మినీ, ఎల్‌జీ ఎల్ 90, సోనీ ఎక్స్‌పీరియా జడ్, సోనీ ఎక్స్‌పీరియా ఎస్పీ, సోనీ ఎక్స్‌పీరియా టీ, సోనీ ఎక్స్‌పీరియా వి ఉన్నాయి. ఐఓఎస్ 15.1, అంతకంటే పాత వర్షన్లు కలిగి ఉన్న ఐఫోన్లకు కూడా తన సపోర్ట్ వాట్సాప్ నిలిపివేసింది. ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లకు 2025 సంవత్సరం నుంచి వాట్సాప్ సపోర్ట్ చేయదు. ఐఫోన్ యూజర్లకు మే 5 వరకు గడువు ఉంటుంది.