Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు విశాఖపట్నం నుంచి స్పెషల్ ట్రైన్స్ ఇవే
మహా కుంభమేళాను పూర్ణ కుంభమేళా(Maha Kumbh Mela 2025) అని పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది.
- By Pasha Published Date - 04:55 PM, Tue - 24 December 24

Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా సమీపిస్తోంది. 2025 జనవరి 13 నుంచి 2025 ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. ఇది 12 ఏళ్లకోసారి జరిగే మహా ఘట్టం. మహా కుంభమేళాను పూర్ణ కుంభమేళా(Maha Kumbh Mela 2025) అని పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. మహా కుంభమేళా కోసం తూర్పుకోస్తా రైల్వే స్పెషల్ ట్రైన్స్‌ను నడపనుంది. విశాఖపట్నం – గోరఖ్‌పూర్, విశాఖపట్నం- దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
Also Read :Illegal Autism Centres : నకిలీ ఆటిజం థెరపీ కేంద్రాల దందా.. భారీగా ఫీజుల దోపిడీ
స్పెషల్ రైళ్ల వివరాలివీ..
- విశాఖపట్నం – గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్) మధ్య జనవరి 5, 19, ఫిబ్రవరి 16 తేదీల్లో (ఆదివారాల్లో) 08562 నంబరు కలిగిన స్పెషల్ రైళ్లను ఈస్ట్‌కోస్ట్ రైల్వే నడపనుంది. ఈ రైళ్లు ఆయా ఆదివారాల్లో రాత్రి 22.20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మంగళవారం రాత్రి 20.25 గంటలకు గోరఖ్‌పూర్‌కు చేరుకుంటాయి. ఈ రైళ్లు మొత్తం మూడు ట్రిప్పులు నడుస్తాయి.
- ఈ రైలు విశాఖపట్నం – గోరఖ్‌పూర్ మధ్య విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపుర, ఛత్రపూర్, బలుగావ్, ఖుర్దారోడ్డు, భువనేశ్వర్ స్టేషన్లలో ఆగుతుంది.
- యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి ఈ రైలు 08561 నంబరుతో జనవరి 8, 22, ఫిబ్రవరి 19 తేదీల్లో (బుధవారాల్లో) విశాఖపట్నానికి తిరుగు ప్రయాణం అవుతుంది. రైలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 14.20 గంటలకు బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.
- విశాఖపట్నం – గోరఖ్‌పూర్, గోరఖ్‌పూర్ – విశాఖపట్నం మహా కుంభమేళా స్పెషల్ రైళ్లలో 3 టైర్ ఏసీ కోచ్‌లు-4, 3 టైర్ ఏసీ ఎకానమీ కోచ్‌లు -2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు – 8, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు -4, సెకండ్‌క్లాస్ కమ్ లగేజీ/ దివ్యాంగుల కోచ్ -1 ఉంటాయి.
Also Read :Lord Krishna Incarnation : కేజ్రీవాల్ శ్రీకృష్ణుడి అవతారం.. ఎందుకో వివరించిన అవధ్ ఓఝా
- విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ మధ్య స్పెషల్ ట్రైను (08530) మొత్తం ఆరు ట్రిప్పులు రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు గురువారం సాయంత్రం 17.35 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 4.30 గంటలకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్టేషనుకు చేరుతుంది. జనవరి 9, 16, 23, ఫిబ్రవరి 6, 20, 26 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
- దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ నుంచి 08529 నంబర్ రైలు శనివారం బయలుదేరి విశాఖపట్నానికి సోమవారం ఉదయం 3.25 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు సింహాచలం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ తదితర స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 3 టైర్ ఏసీ కోచ్‌లు – 4, 3 టైర్ ఏసీ ఎకానమీ కోచ్‌లు – 2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు – 8, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు -4, సెకండ్ క్లాస్ కమ్ లగేజీ / దివ్యాంగుల కోచ్-1 ఉంటాయి.