WhatsApp : 85 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకు ?
లక్షలాది భారతీయ వాట్సాప్ అకౌంట్లను ఎందుకు బ్యాన్(WhatsApp) చేస్తున్నారు ?
- By Pasha Published Date - 05:10 PM, Sun - 3 November 24

WhatsApp : వాట్సాప్.. మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. మన కమ్యూనికేషన్ అవసరాలకు ప్రధాన మాధ్యమంగా ఎదిగిపోయింది. దీన్నిబట్టి వాట్సాప్ అకౌంట్లకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతీ ఒక్కరికి వాట్సాప్ అకౌంటు చాలాచాలా ముఖ్యం. దాని ద్వారానే నిత్యం తమ బంధువులు, స్నేహితులు, ఆప్తులతో టచ్‌లో ఉంటారు. అలాంటి వాట్సాప్ అకౌంట్లు ప్రతినెలా లక్షలాదిగా బ్యాన్ అవుతున్నాయి. మన దేశంలో ఆగస్టు నెలలో 84.58 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ అయ్యాయి. సెప్టెంబరు నెలలో మరో 85 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లను వాట్సాప్ కంపెనీ బ్యాన్ చేసింది.
Also Read :Nothing OS : గూగుల్, యాపిల్‌తో ‘నథింగ్’ ఢీ.. సరికొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు
లక్షలాది భారతీయ వాట్సాప్ అకౌంట్లను ఎందుకు బ్యాన్(WhatsApp) చేస్తున్నారు ? కారణం ఏమిటి ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భారత ప్రభుత్వ ఐటీ చట్టం 2021లోని రూల్స్‌ను ఉల్లంఘించే వాట్సాప్ అకౌంట్లపై ఆ కంపెనీ కొరడా ఝుళిపిస్తోంది. అలాంటి వాట్సాప్ అకౌంట్లను ఎప్పటికప్పుడు గుర్తించి బ్యాన్ విధిస్తోంది. తాజాగా సెప్టెంబరులో బ్యాన్‌కు గురైన 85 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లలో దాదాపు 16.58 లక్షల అకౌంట్లపై వాట్సాప్ కంపెనీకి ఫిర్యాదులేం అందలేదు. అయినా వాటిని బ్యాన్ చేశారు.
Also Read :Annakoot Mahotsav 2024 : ఎటు చూసినా లడ్డూలే.. కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ ఆలయాల్లో ‘అన్నకూట్’
ఎందుకంటే.. అవి ఐటీ చట్టంలోని రూల్స్‌ను అతిక్రమించి నడుస్తున్నాయి. ఆయా వాట్సాప్ అకౌంట్లను దుర్వినియోగం చేస్తున్నారు. కొన్ని వాట్సాప్ అకౌంట్ల ద్వారా ప్రజలను మోసగించే సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు. ఇంకొన్ని వాట్సాప్ అకౌంట్ల ద్వారా బల్క్, స్పామ్ మెసేజులను పంపుతున్నారు. ఇలా చేయడం భారతీయ చట్టాలకు విరుద్ధం. ఈవిషయాన్ని వాట్సాప్ కంపెనీ టీమ్స్ గుర్తించాయి. అందుకే ఆయా వాట్సాప్ అకౌంట్లపై ఫిర్యాదులు రాకున్నా.. బ్యాన్ లిస్టులో చేర్చింది. మనదేశంలో దాదాపు 60 కోట్ల వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయి. ఇంత భారీ వాట్సాప్ అకౌంట్లను ఎప్పటికప్పుడు నిశితంగా స్క్రీన్ చేసి, నిర్వహించడం అనేది అతిపెద్ద సవాలే.