Aadhaar Update: ఆధార్ లో అడ్రస్ తప్పుగా ఉందా.. అయితే ఇంట్లో నుంచి ఈజీగా చేంజ్ చేసుకోండిలా?
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రభుత్వ ప్రైవేటు పథకాలకు ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డు అన్నది త
- By Nakshatra Published Date - 04:05 PM, Mon - 18 December 23
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రభుత్వ ప్రైవేటు పథకాలకు ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. మరి అలాంటి ఆధారంలో చిన్న చిన్న తప్పులు ఉన్నప్పుడు తప్పకుండా సరి చేసుకోవాలి. అయితే మీ ఆధార్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా. మరి ఇంట్లో నుంచే ఈజీగా ఉచితంగా ఆధార్ లో అడ్రస్ ను ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యూఐడీఏ సహాయంతో ఆధర్ లో అడ్రస్ ను ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం ముందుగా యూఐడీఏఐ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ మోడ్ లో అప్డేట్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ చొరవ, డిజిటల్ ఇండియా చొరవ వల్ల మాత్రమే ఉచిత సేవలు సాధ్యమయ్యాయి. myaadhaar.uidai.gov.in పోర్టల్ ఈ ప్రక్రియ సులభంగా చేసుకోవచ్చు. అలాగే వ్యక్తులు అధికారిక ఆధార్ కేంద్రాలను సందర్శించడం ద్వారా వారి ఆధార్ కార్డ్ వివరాలను ఆఫ్‌లైన్‌లో కూడా అప్డేట్ చేయవచ్చు. అయితే, ఆఫ్‌లైన్ అప్డేట్కు వారు తమ ఆధార్‌లో చేసే ప్రతి మార్పు/అప్డేట్కు 50 రూపాయల రుసుము చెల్లించాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది మార్చి 14 వరకూ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ వంటి వివరాల కోసం ఆధార్ కార్డ్ హోల్డర్లు ఉచిత అప్డేట్ సేవను ఉపయోగించడానికి యూఐడీఏఐ అనుమతిస్తుంది. ఇది ఆధార్ సంబంధిత మార్పుల కోసం ప్రభుత్వ సంస్థ అందించే ఇతర అప్డేట్ సేవలను ప్రభావితం చేయదు.
అయితే ఈ సేవ ఆధార్‌లోని పేరు, లింగం, పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి వివరాల కోసం అప్డేట్లను కవర్ చేయదు. అలాగే గత పదేళ్లలో ఒక్కసారి కూడా ఆధార్ అప్ డేట్ చేయని వారిని కూడా ఒకసారి బయోమెట్రిక్స్ ఇచ్చి అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. మరి ఎలా అప్డేట్ చేసుకోవాలి అన్న విషయానికొస్తే.. యూఐడీఏఐ వెబ్సైట్లో ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ని ఓపెన్ చేసి మీ ఆధార్ నంబర్, క్యాప్చా, మీ ఫోన్లో అందుకున్న వన్ టైమ్ పాస్వర్డ్ ని ఉపయోగించి లాగిన్ చేయాలి. డాక్యుమెంట్ అప్డేట్ విభాగానికి వెళ్లి, కచ్చితత్వం కోసం మీ ప్రస్తుత వివరాలను సమీక్షించాలి. డ్రాప్-డౌన్ జాబితా నుంచి తగిన డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకోవాలి. ధ్రువీకరణ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీ వివరాల అప్డేట్ ప్రక్రియ పురోగతిని ట్రాక్ చేయడానికి సేవా అభ్యర్థన నంబర్‌ను నోట్ చేసుకోవాలి.
Related News
Aadhaar As Date Of Birth Proof: ఇక నుండి ఆధార్.. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఉత్తర్వులు జారీ..!
లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.