Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదంపై బ్రిటన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముడిపడి ఉన్న ప్రమాదాలను గ్రహించిన బ్రిటన్, దానిని పర్యవేక్షించడానికి గ్లోబల్ బాడీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
- By Praveen Aluthuru Published Date - 08:30 PM, Sat - 3 June 23

Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముడిపడి ఉన్న ప్రమాదాలను గ్రహించిన బ్రిటన్, దానిని పర్యవేక్షించడానికి గ్లోబల్ బాడీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ సంస్థ వియన్నాలోని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తరహాలో పని చేస్తుంది. అణుశక్తి వినియోగాన్ని పర్యవేక్షించడానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 1957లో ఏర్పడింది . ప్రస్తుతం భారతదేశంతో సహా 176 దేశాలు అందులో సభ్యులుగా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు లండన్‌లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ ప్రతిపాదించారు. దీనికి సంబంధించి వచ్చే వారం అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో చర్చలు జరపనున్నారు.
Read More: Chiranjeevi : నేను ఆ టెస్ట్ చేయించకపోతే క్యాన్సర్ వచ్చేదేమో.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..