Nokia C12: మార్కెట్లోకి మరో నోకియా కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా ఇప్పటికీ మార్కెట్లోకి ఎన్నో అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను
- By Nakshatra Published Date - 07:00 AM, Wed - 15 March 23

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా ఇప్పటికీ మార్కెట్లోకి ఎన్నో అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్న నోకియా సంస్థ తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేసింది. కాగా ఈ ఏడాది జనవరిలో యూరోపియన్ మార్కెట్‌లో విడుదలై హిట్ టాక్ పొందిన నోకియా సీ12 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారత్‌కు కూడా వచ్చేసింది.
మన దేశంలో మార్చి 17 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. అయితే ఈ ఎంట్రీలెవెల్ స్మార్ట్ ఫోన్ కోసం మీరు కేవలం రూ.5,999 చెలిస్తే చాలు. ఇకపోతే నోకియా సీ12 స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. మార్చి 17 నుంచి అందుబాటులోకి రానున్న ఈ నోకియా సీ12 ఆండ్రాయిడ్ 12 తో పనిచేస్తుంది. ఇంకా రెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్, 6.3 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్ డ్రాప్ స్టైల్ కట్‌అవుట్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ యూనిసోక్ 9863A 1 ఎస్ఓసీ, 2జీబీ ర్యామ్, 4జీబీ వరకు ర్యామ్ పెంచుకునే అవకాశం, 8 ఎంపీ రియర్ కెమెరా, ఆటోఫోకస్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో లభించనుంది.
అలాగే 64 జీబీ ఆన్‌బోర్డ్ మెమరీ, ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ వంటివి ఇందులో లభించనున్నాయి. ఇక ఈ నోకియా సీ12 బ్యాటరీ విషయానికొస్తే.. ఇది 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. ఇది 5వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ కలర్ విషయానికి వస్తే.. కార్కోల్, డార్క్ సియాన్, లైట్ మింట్ కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ లభించనుంది.

Related News

OnePlus: మార్కెట్ లోకి మరో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం