iPhone 15: ఐఫోన్-15 కొనాలంటే EMI ఎంత?
భారతదేశంలో ఐఫోన్ 15 మార్కెట్లోకి వచ్చింది. కానీ దాని ధర సామాన్యుడికి ఆమడదూరంలో ఉన్నది. ఒక భారతీయుడు ఈ మోడల్ ఫోన్ కొనాలంటే
- By Praveen Aluthuru Published Date - 02:45 PM, Wed - 13 September 23

iPhone 15: భారతదేశంలో ఐఫోన్ 15 మార్కెట్లోకి వచ్చింది. కానీ దాని ధర సామాన్యుడికి ఆమడదూరంలో ఉన్నది. ఒక భారతీయుడు ఈ మోడల్ ఫోన్ కొనాలంటే వారి నెలవారీ జీతంలో 75 శాతానికి పైగా ఫోన్ ఈఎంఐ కి వెచ్చించాల్సి ఉంది. భారతీయుల సగటు ఆదాయం రూ. 198,082.54. అంటే భారతీయుల సగటు నెలవారీ ఆదాయం రూ. 16,506. ఐఫోన్ 15 రూ. 79,900 నుండి ప్రారంభమవుతుంది, అధికారిక యాపిల్ వెబ్‌సైట్‌లో రూ.12,483 EMIతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 Pro Max దీని ధర రూ. 159,900. దీనికి నెలకి రూ.21,483 EMI చెల్లించాలి. దీన్ని బట్టి చూస్తే భారతీయుల సగటు ఆదాయంలో 75 శాతానికి పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఐఫోన్ ప్రో మ్యాక్స్ విషయానికొస్తే జీతంలో 130 శాతానికి పైగా ఖర్చు చేయాలి.
Also Read: Jagan Delhi Strategy : చంద్రబాబుకు కమాండో భద్రత తొలగింపు?