Mivi AI : మేడిన్ హైదరాబాద్ ‘మివి ఏఐ’.. మనిషిలా ఆలోచించి సంభాషిస్తుంది
‘మివి’(Mivi AI) కంపెనీకి చెందిన ఏఐ ఆధారిత వాయిస్ టూల్ ఆధారంగా ఏఐ ఇయర్ బడ్స్‌ను అభివృద్ధి చేశారు.
- By Pasha Published Date - 11:28 AM, Sat - 12 April 25

Mivi AI : కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్) విభాగంలో హైదరాబాద్ స్టార్టప్ ‘మివి’ సత్తా చాటుతోంది. ఏఐ టెక్నాలజీని మరో లెవల్‌కు తీసుకెళ్లే దిశగా మివి కీలక ముందడుగు వేసింది. అచ్చం ఒక మనిషిలా ఆలోచించి సంభాషించగలిగే సరికొత్త ఏఐని మివి రెడీ చేసింది. దీనికే ‘ఏఐ మివి’ అని పేరు పెట్టారు. ఆధునాతన లాంగ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)తో దీన్ని ఆవిష్కరించారు. మివి ఏఐ మనిషి భావోద్వేగాల్ని అర్థం చేసుకొని, అందుకు తగ్గట్లు సమాధానాలు ఇస్తుంది. వివిధ భాషలకు చెందిన ఎన్నో రకాల యాసలకు అనుగుణంగా ఈ టూల్ పనిచేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా ‘హాయ్ మివి’ అనే వేక్ వర్డ్‌ను రూపొందించారు. మివి ఏఐ తయారీ కోసం దాదాపు 100 మంది ఇంజినీర్లు పనిచేశారట. ఇందుకోసం దాదాపు రూ.86 కోట్లు ఖర్చయిందట. రానున్న రోజుల్లో మివి ఏఐ టెక్నాలజీని స్మార్ట్ హోం పరికరాలు, వినియోగదారుల సేవా కేంద్రాలు, ఏఐ ఉత్పత్తుల్లో జోడించనున్నారు.
Also Read :Abid Hasan Safrani : భారతావనికి ‘జైహింద్’ ఇచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ
మివి ఏఐ ఇయర్ బడ్స్.. ఫీచర్స్ ఇవీ..
- ‘మివి’(Mivi AI) కంపెనీకి చెందిన ఏఐ ఆధారిత వాయిస్ టూల్ ఆధారంగా ఏఐ ఇయర్ బడ్స్‌ను అభివృద్ధి చేశారు.
- ఈ ఏడాది జూన్‌లో వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
- వీటి ధర రూ.10,000 కంటే తక్కువే ఉంటుందని అంటున్నారు.
- ఈ ఏఐ బడ్స్‌ను చెవిలో పెట్టుకుని.. ఓ ఫ్రెండ్‌తో మాట్లాడినట్టుగా మాట్లాడి మన ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలను రాబట్టుకోవచ్చు.
- ఏ వంటకం ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా ఇది చెబుతుంది. తాజా వార్తలను సైతం ఇది చదివి వినిపిస్తుంది. చక్కటి స్వరంతో ఇవన్నీ మనకు అందిస్తుంది.
- తొలుత ఇంగ్లిష్ భాషలోనే మివి ఏఐ బడ్స్ లభిస్తాయని సమాచారం. తదుపరిగా దీన్ని అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తేనున్నారు.
- తొలుత మివి వెబ్‌సైట్ ద్వారా వీటిని విక్రయిస్తారు. ఆ తర్వాత మిగతా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విక్రయిస్తారు.
- హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న మివి ప్లాంట్‌లో ఈ ఏడాది జూన్ కల్లా ఏఐ ఇయర్ బడ్స్ ఉత్పత్తి ప్రారంభం కానుంది.