Business News: ఎలక్ట్రానిక్ దిగుమతిపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం
లైసెన్స్ లేని ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతిపై భారత ప్రభుత్వం ఆగస్టు 3న నిషేధం విధించింది. నాణ్యమైన ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మరియు వ్యక్తిగత కంప్యూటర్‌లు దేశంలోకి రాకుండా నిరోధించడం మరియు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం దీని లక్ష్యం.
- By Praveen Aluthuru Published Date - 02:45 PM, Sun - 24 September 23

Business News: లైసెన్స్ లేని ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతిపై భారత ప్రభుత్వం ఆగస్టు 3న నిషేధం విధించింది. నాణ్యమైన ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మరియు వ్యక్తిగత కంప్యూటర్‌లు దేశంలోకి రాకుండా నిరోధించడం మరియు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం దీని లక్ష్యం.
భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేరొందిన బడా కంపెనీలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మరియు పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతి కోసం లైసెన్సింగ్ ఆవశ్యకత గడువును మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది. ఈ మేరకు ఇద్దరు సీనియర్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. యాపిల్, శాంసంగ్, లెనోవో వంటి పెద్ద కంపెనీలకు ఇది చాలా ఉపశమనం కలిగించే అంశం. సదరు ఎలక్ట్రానిక్ పరిశ్రమల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం నిషేధం గడువును మూడు నెలలు పొడిగించింది. అంటే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మరియు పర్సనల్ కంప్యూటర్‌లను లైసెన్స్ లేకుండా వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు దిగుమతి చేసుకోవచ్చు.
Also Read: Wife Shoot Husband: విడాకులు అడిగినందుకు భర్తపై భార్య కాల్పులు