HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >How Indias Drone Start Ups Could Change Healthcare

Drone Start-Ups: వస్తున్నాయ్ మెడికల్ డ్రోన్స్

' ఆ డ్రోన్ కొందరు రోగుల బ్లడ్ శాంపిల్లతో నింగిలోకి రివ్వున ఎగిరింది.. మీరట్ నుంచి నోయిడా వైపు బయలుదేరింది.

  • By Hashtag U Published Date - 05:16 PM, Sun - 1 May 22
  • daily-hunt
Drone
Drone

‘ ఆ డ్రోన్ కొందరు రోగుల బ్లడ్ శాంపిల్లతో నింగిలోకి రివ్వున ఎగిరింది.. మీరట్ నుంచి నోయిడా వైపు బయలుదేరింది. 72 కిలోమీటర్లు ప్రయాణించి ఒకే ఒక గంట వ్యవధిలో నోయిడాలోని ఒక ప్రముఖ డయాగ్నస్టిక్ ల్యాబ్ ఆవరణలో వాలింది.. వెంటనే ఆరోగ్య కార్యకర్తలు వచ్చి.. డ్రోన్ లోని కోల్డ్ స్టోరేజీని తెరిచి, అందులోని బ్లడ్ శాంపిళ్లను టెస్టింగ్ కోసం తీసుకెళ్లారు’ ఈ ఘటన ఇటీవల ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వాస్తవానికి రోడ్డు మార్గంలో మీరట్ నుంచి నోయిడా కు వెళ్లాలంటే .. కనీసం రెండు గంటల సమయం పడుతుంది. కానీ డ్రోన్ సగం సమయంలోనే గమ్య స్థానానికి బ్లడ్ శాంపిళ్లను చేర్చింది.

సమూల మార్పుల దిశగా..

రానున్న రోజుల్లో మన దేశ వైద్యరంగ సేవల ముఖ చిత్రాన్ని డ్రోన్లు సమూలంగా మార్చబోతున్నాయి. ప్రజలకు వైద్య సేవలను వేగంగా అందించేందుకు కీలక మాధ్యమంగా ఉపయోగపడనున్నాయి. వైద్య పరీక్షల కోసం రోగుల ఇళ్లకు వెళ్లి శాంపిళ్లను కలెక్ట్ చేయడానికి భవిష్యత్ లో డ్రోన్లే వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎవరికైనా అత్యవసరంగా బ్లడ్ అవసరమైతే.. బ్లడ్ బ్యాంక్ నుంచి నేరుగా ఆస్పత్రికి డ్రోన్ లో బ్లడ్ ప్యాకెట్ ను పంపే రోజులూ దగ్గరలోనే ఉన్నాయి. ఇటువంటి వాటిని 2 డిగ్రీల సెల్సీయస్ నుంచి 8 సెల్సీయస్ మధ్య నిల్వ చేసి తీసుకెళ్లేలా డ్రోన్ల లో చిన్నపాటి కోల్డ్ స్టోరేజీ కూడా ఉంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు రవాణా వ్యవస్థ అంత మెరుగ్గా ఉండదు. దీంతో అక్కడి మారుమూల ప్రాంతాలకు కోవిడ్ టీకాలను పంపేందుకు డ్రోన్లను పెద్దఎత్తున వినియోగించారు.

డ్రోన్ సర్వీసులకు క్రేజీ..

వాస్తవానికి భారత ప్రభుత్వం డ్రోన్ల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను గత సంవత్సరమే సరళతరం చేసింది. అవి దేశంలోని ఏయే రూట్లలో ఎగరాలి ? ఎంత ఎత్తులో ఎగరాలి ? ఏయే ప్రమాణాలు పాటించాలి ? అనే దానిపై స్పష్టత ఇచ్చింది. డ్రోన్ల సేవలకు అనుమతుల కోసం చేసే దరఖాస్తు ప్రక్రియ ను చాలా ఈజీగా మార్చింది. ఈనేపథ్యంలో చాలా డ్రోన్ల ఆపరేటింగ్ కంపెనీలు వాటి కార్యకలాపాలను విస్తరించాయి. ‘ స్కై ఎయిర్ మొబిలిటీ’ అనే కంపెనీ కూడా వీటిలో ఒకటి. మీరట్ నుంచి నోయిడా కు బ్లడ్ శాంపిళ్లను తీసుకెళ్లిన డ్రోన్ వీరి కంపెనీదే. 2021 నవంబరు నుంచి ఇప్పటివరకు ఈ కంపెనీ ఈ-కామర్స్ కంపెనీల ఆర్డర్లు, వైద్య పరీక్షల రిపోర్టులు సహా ఎన్నో వస్తువులను గమ్య స్థానాలకు చేర్చేందుకు దాదాపు 1000 డ్రోన్ సర్వీసులు నడిపింది. అంటే.. డ్రోన్ సర్వీసులకు ఉన్న క్రేజీ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. చాలా డయాగ్నస్టిక్ ల్యాబ్ లు, ఆస్పత్రులు భవిష్యత్ లో ఇటువంటి డ్రోన్ సేవల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా యోచిస్తున్నాయి. ఒకవేళ డ్రోన్ ద్వారా త్వరితగతిన సేవలు కోరుకునే వినియోగదారుల నుంచి ఎక్కువ సేవా రుసుమును వసూలు చేస్తారు.

తెలంగాణలోనూ..

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో 2021 సెప్టెంబరు 11న తొలిసారిగా డ్రోన్ల తో ఔషధాల పంపిణీ ప్రయోగాత్మకంగా జరిగింది. బ్లూ డాట్, టెక్ ఈగల్ అనే రెండు డ్రోన్లను ఔషధాలతో నింపగా.. అవి కొన్ని నిమిషాల్లోనే 6 కిలోమీటర్ల దూరంలోని ఒక ప్రాంతీయ ఆస్పత్రికి మందులు చేరవేశాయి. ‘ మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ ప్రాజెక్టులో భాగంగా.. రోడ్డు రవాణా వ్యవస్థ క్లిష్టంగా ఉండే అండమాన్ నికోబార్, మణిపూర్, నాగాలాండ్ వంటి ప్రాంతాల్లో మెడికల్ డ్రోన్ల తో ట్రయల్స్ నిర్వహించేందుకు గతేడాది భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్మార్) అనుమతులు మంజూరు చేసింది. గరిష్టంగా 3 కిలోమీటర్ల వరకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fly in drone
  • india
  • medical hub
  • Start Ups

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

Latest News

  • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

  • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

  • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

  • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

  • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

Trending News

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd