HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Honor X9b With 108 Megapixel Camera Snapdragon 6 Gen 1 Launched In India Price Specifications

Honor X9b Launch in India: భారత మార్కెట్ లోకి విడుదలైన హానర్ X9b ఫోన్.. పూర్తి వివరాలు ఇవే?

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం హానర్‌ మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాటుల

  • By Anshu Published Date - 05:30 PM, Thu - 15 February 24
  • daily-hunt
Mixcollage 15 Feb 2024 06 17 Pm 7502
Mixcollage 15 Feb 2024 06 17 Pm 7502

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం హానర్‌ మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది హానర్ సంస్థ. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసింది. హానర్ ఎక్స్9బీ కొత్త ఫోన్ ఫిబ్రవరి 15న లాంచ్ అయింది. ఈ సరికొత్త ఎక్స్-సిరీస్ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్‌తో 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌తో పనిచేస్తుంది. 6.78-అంగుళాల కర్వడ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

ఈ ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో 35డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఐపీ53 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. భారత మార్కెట్లో హానర్ ఎక్స్9బీ ఫోన్ ధర రూ. 25,999కు పొందవచ్చు. ఈ ఫోన్ 8జీబీ+256జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ప్రకారం.. హానర్ X9b ఫోన్ మొదటిసారిగా ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు జరుగుతున్నాయి. అమెజాన్ దేశవ్యాప్తంగా 1,800 రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ఫోన్ విక్రయించనుంది. వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి రూ.3వేల తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు.

ఇకపోతే హానర్ X9b స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికి వస్తే.. డ్యూయల్ సిమ్ హానర్ X9b పైన మ్యాజిక్ ఆపరేటింగ్ సిస్టమ్ 7.2తో ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K కర్వడ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. అల్ట్రా-బౌన్స్ యాంటీ డ్రాప్ డిస్‌ప్లే టెక్నాలజీ 1.2 రెట్లు డ్రాప్ ఇంపాక్ట్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌తో పాటు క్వాల్‌కామ్ 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌తో రన్ అవుతుంది. ఫోటోలు, వీడియోలకు హానర్ ఎక్స్9బీలో ఎఫ్/1.75 ఎపర్చరుతో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఎఫ్/2.2తో 5ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి.

ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 16ఎంపీ కెమెరాను కలిగి ఉంది. హానర్ X9b ఫోన్‌లో 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని పొందవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 5,800ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 35డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టుతో మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని పేర్కొంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • Honor X9b
  • Honor X9b Launch in India
  • Honor X9b smart phone
  • india

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

Latest News

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

  • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

  • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

  • Air China Flight : విమానంలో మంటలు

  • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd