Hero Motors: బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ధర, ఫీచర్స్ ఇవే?
దేశవ్యాప్తంగా రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే
- Author : Anshu
Date : 18-03-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
దేశవ్యాప్తంగా రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్స్ ని విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మార్కెట్ లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రముఖ టు వీలర్ సంస్థ అయిన హీరో మోటార్స్ లక్షల లోపే రెండు మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ఇప్పటికే ఎన్నో స్కూటీర్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ వివరాల్లోకి వెళితే.. హీరో ఎలక్ట్రిక్ Optima CX5.0, Optima CX2.0 సింగల్. కాగా NYX అప్‌డేట్ వెర్షన్‌లను విడుదల చేసింది. వాటి ధర ₹ 85,000 నుండి రూ. 1.05 లక్షల వరకు ఉంటుందని వేరియంట్ ఆధారంగా ధర నిర్ణయించబడుతుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సిఎక్స్ 5.0 మ్యాట్ బ్లూ షేడ్ మ్యాట్ మెరూన్ షేడ్, ఆప్టిమా సిఎక్స్ 2.0 మ్యాట్ బ్లూ బ్లాక్ కలర్‌లో లభిస్తుండగా, ఎన్‌వైఎక్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో లభిస్తుంది.
కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యుత్తమ సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ఎందుకంటే కంపెనీ టాప్-ఆఫ్-లైన్ మోడల్ అధిక మైలేజీని అందుకోవడానికి పవర్‌ట్రెయిన్‌ను అందిస్తోంది. ఇవి హైబర్నేటింగ్ బ్యాటరీ టెక్నాలజీని కూడా కలిగి ఉంటాయి. కంపెనీ 5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొంది ప్రకటించడానికి మేము గర్విస్తున్నాము.