Google Calendar : గూగుల్ క్యాలెండర్‌లో కొత్తగా ‘ఫుల్ స్క్రీన్’ ఫీచర్.. ఏమిటిది ?
ఇందుకోసం తొలుత గూగుల్ క్యాలెండర్(Google Calendar) యాప్‌లోని హోంస్క్రీన్‌లోకి వెళ్లాలి.
- By Pasha Published Date - 05:20 PM, Tue - 26 November 24

Google Calendar : ‘గూగుల్ క్యాలెండర్’ యాప్ చాలా ఫేమస్. ఇది అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఉంటుంది. నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దీన్ని వినియోగిస్తుంటారు. ఈ యాప్‌లో త్వరలో ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. అదేమిటో తెలుసుకుందాం..
Also Read :Nuclear Weapons : ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలిస్తే.. మీ అంతు చూస్తాం : రష్యా
గూగుల్ క్యాలెండర్ యాప్‌లో టాస్క్ మేనేజ్‌మెంట్‌ను మరింత ఈజీ చేయడమే రాబోయే కొత్త ఫీచర్ ప్రత్యేకత. ఈ ఫీచర్‌ను వాడుకొని మనం గూగుల్ క్యాలెండర్‌లో టాస్క్‌లు క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం, సబ్ టాస్క్‌లను ఫిక్స్ చేయడం వంటివన్నీ చేసేయొచ్చు. అంతేకాదు క్యాలెండర్‌లోని ‘ఆల్ యూజర్స్’, ‘టాస్క్స్’, ‘టాస్క్స్ లిస్ట్’లను ఏకకాలంలో చూసేలా ఫుల్ స్క్రీన్ వ్యూ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇంతకుముందు ఫుల్ స్క్రీన్ వ్యూలో గూగుల్ క్యాలెండర్‌లోని టాస్క్‌ల తేదీలు మాత్రమే కనిపించేవి. ఇకపై పైన మనం చెప్పుకున్న సమాచారం అదనంగా డిస్‌ప్లే అవుతుంది. వాస్తవానికి ఫుల్ స్క్రీన్ ఫీచర్‌ను గూగుల్ క్యాలెండర్ 2023 సంవత్సరంలోనే తమ వెబ్ యూజర్లకు తీసుకొచ్చింది. ఇప్పుడు దీన్ని అందరు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరు యూజర్లకే అందుబాటులోకి వచ్చింది. విడతల వారీగా అందరికీ దీన్ని గూగుల్ అందుబాటులోకి తీసుకొస్తుంది.
Also Read :Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిసారిగా రోబోలు.. ఏం చేస్తాయి తెలుసా ?
ఫుల్ స్క్రీన్ ఫీచర్‌ను వాడుకోవడం చాలా ఈజీ. ఇందుకోసం తొలుత గూగుల్ క్యాలెండర్(Google Calendar) యాప్‌లోని హోంస్క్రీన్‌లోకి వెళ్లాలి. అక్కడ యూజర్ ప్రొఫైల్ పక్కనే చెక్‌మార్క్‌తో కూడిన ఆప్షన్ కనిపిస్తుంది. దానిలోనే నేటి టాస్కులను సైతం మనం చూడొచ్చు. చెక్ మార్క్ ఆప్షన్‌ను క్లిక్ చేయగానే మై టాస్క్స్, ట్రావెల్, న్యూ లిస్ట్ అనే ఆప్షన్లు మనకు ఏకకాలంలో కనిపిస్తాయి. మనం చేయాల్సి ఉన్న టాస్క్‌లు, ఇప్పటివరకు పూర్తయిన టాస్క్‌లు, కొత్త టాస్క్‌లు వంటి సమాచారం మనకు ఒకేచోట కనిపిస్తుంది. గూగుల్ వర్క్‌స్పేస్, గూగుల్ వర్క్‌స్పేస్ ఇండివిడ్యువల్ కస్టమర్లు, వ్యక్తిగత గూగుల్ అకౌంట్లు కలిగిన వారందరూ ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు.