BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్
BSNL : ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న BSNL, ప్రైవేట్ సంస్థలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో పోటీతో వెనుకబడింది. ఇప్పటికే ఈ ప్రైవేట్ కంపెనీలు 5G సేవలు అందిస్తున్న సమయంలో, BSNL మాత్రం ఆలస్యంగా 4G సేవలను ప్రారంభిస్తోంది
- By Sudheer Published Date - 04:30 PM, Fri - 26 September 25

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన స్వదేశీ 4G సేవలను సెప్టెంబర్ 27న దేశవ్యాప్తంగా ప్రారంభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ఈ సేవలను ఒడిశాలోని జార్సుగుడా నుంచి ఆవిష్కరించనున్నారు. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరించిన ప్రకారం, సుమారు 98 వేల సైట్స్‌లో ఒకేసారి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్లౌడ్ ఆధారిత నెట్‌వర్క్‌గా రూపొందిన ఈ సాంకేతికత భవిష్యత్తులో 5G అప్‌గ్రేడ్‌ను సులభతరం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే వేదికగా ప్రధాని మోదీ “100 శాతం 4G సాచురేషన్ ప్రాజెక్ట్” ను కూడా ప్రారంభించనున్నారు, దీని ద్వారా దాదాపు 30 వేల గ్రామాల్లో టెలికాం సేవలు చేరనున్నాయి.
KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్
స్వదేశీ టెలికాం పరికరాల తయారీలో భారత్ ఇప్పుడు అగ్రదేశాల సరసన చేరిందని సింధియా పేర్కొన్నారు. ఇప్పటివరకు డెన్మార్క్, చైనా, దక్షిణ కొరియా, స్వీడన్ మాత్రమే ఈ రంగంలో ముందంజలో ఉండగా, భారత్ ఐదో దేశంగా నిలవడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా టెలికాం రంగంలో దేశీయ సాంకేతికతకు ప్రాధాన్యం కలుగుతుంది. అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు లేని కనెక్టివిటీని అందించేందుకు ఇది మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ
ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న BSNL, ప్రైవేట్ సంస్థలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో పోటీతో వెనుకబడింది. ఇప్పటికే ఈ ప్రైవేట్ కంపెనీలు 5G సేవలు అందిస్తున్న సమయంలో, BSNL మాత్రం ఆలస్యంగా 4G సేవలను ప్రారంభిస్తోంది. అయితే, BSNL ప్రత్యేకత దాని చవకైన ప్లాన్లలోనే ఉంది. ఇతర కంపెనీలతో పోలిస్తే దాదాపు సగం ధరలోనే సేవలు అందించగలగడం వల్ల, గ్రామీణ ప్రజలు, తక్కువ ఆదాయం కలిగిన వర్గాలకు ఇది పెద్ద ఉపశమనం కానుంది. నిపుణులు భావిస్తున్నట్లుగా, BSNL 4G విజయవంతమైతే, భవిష్యత్తులో 5G పోటీలో కూడా స్థానం సంపాదించే అవకాశముందని చెప్పవచ్చు.