Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ
Vote For Note Case : ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కి వాయిదా వేసింది
- By Sudheer Published Date - 03:46 PM, Fri - 26 September 25

తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపిన “ఓటుకు నోటు” (Vote For Note Case) కేసు మరోసారి ప్రాధాన్యత పొందింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ కేసు అసలు ACB పరిధిలోకి రాదని, తమ పేర్లు అనవసరంగా జోడించబడ్డాయని రేవంత్ రెడ్డి, సండ్ర తమ వాదనలో తెలిపారు. ముఖ్యంగా రెండేళ్ల తర్వాత తనను కేసులో చేర్చారని సండ్ర హైలైట్ చేశారు.
KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్
ఈ నేపథ్యంలో న్యాయవాదులు, హైకోర్టు ఇచ్చిన గత తీర్పును ప్రస్తావించారు. ముఖ్య నిందితుల్లో ఒకరైన మత్తయ్యను కేసు నుంచి తప్పించాలని ఆదేశించిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ముందు ఉంచారు. ఆ తీర్పు ప్రకారం, కేసులో నిందితులపై ఆరోపణలు సమగ్రంగా పరిశీలించాలని, నిర్ధారిత ఆధారాలు లేకుండా ఎవరినీ చేర్చకూడదని పేర్కొనబడింది. ఈ తీర్పు కాపీలను రికార్డు కోసం సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
ఈ కేసులో తుది తీర్పు ఎలా వస్తుందన్నది తెలంగాణ రాజకీయ వర్గాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి పేరు ఈ కేసులో ఉండటం, అలాగే బీఆర్‌ఎస్ పాలన కాలంలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే అక్టోబర్ 14న విచారణ జరగనుండటంతో, ఈ కేసు తీరు ఏ దిశలో సాగుతుందో అన్నది రాష్ట్ర రాజకీయాలపై నేరుగా ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.