Oppo 5G Smartphone: మార్కెట్ లోకి ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పొ ఎప్పటికప్పుడు అతి తక్కువ బడ్జెట్ లో మంచి మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల
- By Nakshatra Published Date - 07:44 PM, Tue - 11 July 23
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పొ ఎప్పటికప్పుడు అతి తక్కువ బడ్జెట్ లో మంచి మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒప్పో సంస్థ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒప్పో నుంచి కొత్త 5జీ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. రెనో సిరీస్ లో రెనో 10 5జీ, రెనో 10 ప్రో మోడళ్లకు అప్ గ్రేడ్ వెర్షన్ గా ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. దీనిలో స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెన్ 1 చిప్ సెట్ ఉంటుంది. అలాగే 64ఎంపీ ఆప్టికల్ జూమ్ లెన్స్ తో ఈ ఫోన్ వస్తోంది.
ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బస్ట్ పోర్ట్ రైట్ ఫోన్ అని ఒప్పో ప్రకటించుకుంది. ఇకపోతే ఈ ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ ధర ఫీచర్ల విషయానికొస్తే..ఈ ప్రీమియం కర్వడ్ స్మార్ట్ ఫోన్ లో 6.74 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ 10 బిట్ అమోల్డ్ ప్యానల్ ఉంటుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ ఫోన్ బరువు 194గ్రాములుంటుంది. మందం 8.28ఎంఎం ఉంటుంది. అధిక పనితీరు కోసం స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెన్ 1 ఎస్ఓసీ, అడ్రెనో 730 జీపీయూ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ 4,600ఎంఏహెచ్ సామర్థ్యంను కలిగి ఉండనుంది.
100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 64ఎంపీ టెలిఫొటో పోర్ట్ రైట్ ఓఐఎస్, 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. ముందు వైపు సెల్ఫీల కోసం 32ఎంపీ కెమెరా ఉంటుంది. వెనుకవైపు కెమెరాతో 4కే రిజల్యూషన్ వీడియోలు తీయవచ్చు. సెకనులో 60 ఫ్రేమ్స్ తీయొచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ ఫోన్ వైఫై6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైఫ్ సీ చార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ రీడర్, ఫేస్ అన్ లాక్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. ఈ ప్రీమియం రెనో 10 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 54,999గా ఉంది. ఇది జూలై 13 నుంచి ఒప్పో అధికారిక వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు సిల్వర్, గ్రే, గ్లోసీ పర్పల్ కలర్స్ లో లభించనుంది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.