HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Doogee V Max With A Monstrous 22000mah Battery Leaks Ahead Of Launch

Doogee V Max: త్వరలో మార్కెట్‌లోకి 22000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్‌.. అద్భుతమైన స్పెసిఫికేషన్ లతో?

సాధారణంగా ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను చూసి ఉంటాం. మార్కెట్ లోకి ఆయా కంపెనీలు ఎన్నో రకాల మొబైల్స్ ను

  • Author : Anshu Date : 12-01-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Doogee V Max
Doogee V Max

సాధారణంగా ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను చూసి ఉంటాం. మార్కెట్ లోకి ఆయా కంపెనీలు ఎన్నో రకాల మొబైల్స్ ను విడుదల చేస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా మనకు మొబైల్స్ లో 4000 ఎంఏహెచ్ నుంచి 7000 ఎంఏహెచ్ కలిగిన స్మార్ట్ ఫోన్లను చూసి ఉంటాము. కొన్ని కొన్ని స్మార్ట్ ఫోన్ లకు అంతకంటే తక్కువ, అంతకంటే ఎక్కువ కూడా వస్తూ ఉంటాయి. కానీ త్వరలోనే మార్కెట్లోకి ఏకంగా 22000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన స్మార్ట్ ఫోన్‌ విడుదల కాబోతోంది. అది ఎలానో ఆ వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్మార్ట్‌ఫోన్ , ఫోన్, డూగీ వీ మ్యాక్స్, కొత్త స్మార్ట్‌ఫోన్” width=”700″ height=”700″ /> డూగీ వీ మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ ఫోన్ త్వరలో మార్కెట్‌ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద బ్యాటరీ, సూపర్ కెమెరా, అధిక ర్యామ్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ సొంతం అని చెప్పవచ్చు. కాగా డూగీ వీ మ్యాక్స్ ఫోన్‌లో 22 వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుందని తెలుస్తోంది. ఔకిటెల్ డబ్ల్యూపీ19 ఫోన్‌లో 21 వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అంటే ఈ ఫోన్‌ను కొత్త ఫోన్ బీట్ చేయబోతోంది. ఈ బ్యాటరీ చార్జింగ్‌కు 33 వాట్ సీ టైప్ చార్జర్ ఉంటుంది. ఈ బ్యాటరీ చార్జింగ్ 10 రోజుల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అంటే ఒక్కసారి చార్జింగ్ పెడితే పది రోజుల వరకు ఈ ఫోన్‌ను ఉపయోగించొచ్చు.

అలాగే ఫోన్ స్టాండ్ బై 64 రోజులు వస్తుందని తెలుస్తోంది. అయితే డూగీ వీ మ్యాక్స్ ఫోన్ చూడటానికి పెద్దదిగా ఉంటుంది. 27.3 ఎంఎం మందం ఉంటుంది. ఇక బరువు ఎంత ఉంటుందో తెలీదు. వీ మ్యాక్స్ ఫోన్‌లో 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండనుంది. వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉండొచ్చు. ఇందులో 108 ఎంపీ కెమెరా, 20 ఎంపీ, 16 ఎంపీ కెమెరాలు ఉండనున్నాయి. డూగీ వీ మ్యాక్స్ ఫోన్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేయనుంది. ఇందులో మీడియాటెక్ డిమెన్‌సిటీ 1080 ప్రాపెసర్ ఉండనుంది. ఇంకా ఇందులో 12 జీబీ ర్యామ్ ఉంటుంది. 19 జీబీ ర్యామ్ వరకు ఎక్స్‌ప్యాండబుల్ చేసుకోవచ్చు. 256 జీబీ మెమరీ ఉంటుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ విషయానీకి వస్తే ధర రూ. 45 వేల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ఎప్పుడు విడుదల కానుంది అన్న విషయం ఇంకా తెలియడం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Doogee V Max
  • features
  • india
  • Smart Phone

Related News

    Latest News

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • Prabhas : ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ..!

    • Vijay – Trisha Relationship : విజయ్ భార్యను ఉద్దేశించే త్రిష ఆ పోస్ట్ చేసిందా ?

    • Minister Sridhar Babu: మహిళలకు గుడ్ న్యూస్.. తులం బంగారం హామీ అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

    • సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై ఆ అధికారుల‌కే ప్రోత్సాహ‌కాలు!

    Trending News

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

      • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

      • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

      • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd