Samsung Galaxy S22: బంపర్ ఆఫర్.. శాంసంగ్ ఫోన్ పై రూ.35 వేల తగ్గింపు.. పూర్తి వివరాలివే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త కొత్త
- Author : Anshu
Date : 15-05-2023 - 4:54 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లోనే మార్కెట్లోకి విడుదల చేస్తూనే మరోవైపు ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లలో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే వినియోగదారుల కోసం ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది శాంసంగ్ సంస్థ.
శాంసంగ్ Galaxy S22 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై 40 శాతం భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.85,999. కానీ ఈ స్మార్ట్ ఫోన్ ని ఏకంగా రూ.35 వేల రూపాయల తగ్గింపుతో అతి తక్కువ ధరకే అందిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 అసలు ధర రూ. 85,999 గా ఉంది. కానీ ఫ్లిప్ కార్ట్‌లో దీనిను మీరు కేవలం రూ. 50,990 లకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అంటే నేరుగా రూ.34,676 సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కాక ఈ ఫోన్ కొనుగోలుపై ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి. Samsung Galaxy S22 కొనుగోలు కోసం ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.
అలాగే IndusInd బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10 శాతం తగ్గింపుతో రూ. 1,000 వరకు ఆదా అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కూడా 5 శాతం తగ్గింపును పొందుతోంది. ఇకపోతే శాంసంగ్ గెలాక్సి ఎస్ 22 స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. డిస్ప్లే Samsung Galaxy S22 6.1 అంగుళాల డైనమిక్ AMOLED ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది 1080 x 2340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ని పొందుతుంది. ఇందులో ఫోన్‌లో ఆక్టా కోర్ చిప్‌సెట్ సపోర్ట్ చేయబడింది. అంతే కాకుండా, S22 మోడల్ స్మార్ట్‌ఫోన్ 5G Android 12 OS పై పనిచేస్తుంది. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 50ఎంపీ,12ఎంపీ,10ఎంపీ వెనుక కెమెరాలను పొందుతుంది. ఇంకా వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 10ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా ఇందులో అందించారు. స్టోరేజ్ విషయానికి వస్తే.. Galaxy S22లో 8జీబీ ర్యామ్,ఇంటర్నెల్ మెమోరీ 128జీబీ ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ కోసం ఈ ఫోన్‌లో 3700 mAh Li-ion బ్యాటరీ అందించబడింది. అదే సమయంలో 45W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు కూడా అందుబాటులో ఉంటుంది.