Indians Earning : మన దేశంలో 31,800 మందికి ఏటా రూ.10 కోట్ల ఆదాయం
దేశంలో ఏటా రూ.10 కోట్లకు మించి సంపాదిస్తున్న వారు 31,800 మంది(Indians Earning) ఉన్నారని నివేదికలో ప్రస్తావించడం విశేషం.
- Author : Pasha
Date : 17-09-2024 - 2:46 IST
Published By : Hashtagu Telugu Desk
Indians Earning : భారతీయుల ఆదాయాలపై సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ సంస్థ సంచలన నివేదికను విడుదల చేసింది. కొంతమంది భారతీయులు ఏటా రూ.10 కోట్ల కంటే ఎక్కువే ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని తెలిపింది. పలువురు భారతీయుల ఆదాయాలు గత ఐదేళ్లలో 63 శాతం మేర పెరిగాయని పేర్కొంది. దేశంలో ధనిక వర్గం పెరుగుతున్న తీరుకు ఈ గణాంకాలు నిదర్శనమని నివేదిక చెప్పింది. ప్రస్తుతం భారత్‌లో ఏటా రూ.5 కోట్లకు మించి ఆదాయాన్ని సంపాదిస్తున్న వారి సంఖ్య 58,200 మందికి చేరిందని వెల్లడించింది. ఈ కేటగిరిలోని ఆదాయ వర్గం సంఖ్య గత ఏడాది వ్యవధిలో 49 శాతం పెరిగిందని తెలిపింది. దేశంలో ఏటా రూ.10 కోట్లకు మించి సంపాదిస్తున్న వారు 31,800 మంది(Indians Earning) ఉన్నారని నివేదికలో ప్రస్తావించడం విశేషం. ఏటా రూ.50 లక్షలకు మించి సంపాదిస్తున్న వారి సంఖ్య కూడా గత ఏడాది వ్యవధిలో 25 శాతం మేర పెరిగి 10 లక్షలు దాటిందని నివేదిక పేర్కొంది.
Also Read :Jio Services Down : జియో సేవల్లో అంతరాయం.. వేలాదిగా ఫిర్యాదుల వెల్లువ
- ఈ నివేదిక ప్రకారం.. 2019 నుంచి 2024 మధ్యకాలంలో దేశంలో ఏటా రూ.5 కోట్లకు మించి సంపాదించే వారి సంఖ్య 49 శాతం మేర పెరిగి 58,200 మందికి చేరింది.
- గత ఐదేళ్ల కాలలో మన దేశంలో ఏటా రూ.10 కోట్లకు మించి సంపాదించే వారి సంఖ్య 63 శాతం మేర పెరిగి 31,800 మందికి చేరింది.
- గత ఐదేళ్ల వ్యవధిలో దేశంలో ఏటా రూ.10 కోట్లకు మించి సంపాదించే వారంతా కలిసి మొత్తంగా దాదాపు రూ.38 లక్షల కోట్లు ఆర్జించారని నివేదిక తెలిపింది.
- గత ఐదేళ్ల వ్యవధిలో ఏటా రూ.5 కోట్లకు మించి సంపాదించే వారంతా కలిసి మొత్తంగా దాదాపు రూ.40 లక్షల కోట్లను ఆర్జించారని నివేదిక పేర్కొంది.
- గత ఐదేళ్ల వ్యవధిలో ఏటా రూ.50 లక్షలకు మించి సంపాదించే వారంతా కలిసి మొత్తంగా దాదాపు రూ.49 లక్షల కోట్లను ఆర్జించారని నివేదిక చెప్పింది.