Apple AirPods Pro: ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోపై భారీ డిస్కౌంట్.. కేవలం రూ. 323కే సొంతం చేసుకోండిలా?
ఎయిర్ పాడ్స్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే. ఎందుకంటే యాపిల్ పాడ్స్ పై ఇప్పుడు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి.
- By Anshu Published Date - 03:35 PM, Tue - 26 December 23

ఎయిర్ పాడ్స్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే. ఎందుకంటే యాపిల్ పాడ్స్ పై ఇప్పుడు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. క్రిస్మస్ 2024కి ముందు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఎయిర్‌పాడ్స్ ప్రో చిన్న స్టెమ్ వైడ్ ఛార్జింగ్ కేస్, సిలికాన్ ఇయర్‌టిప్‌లతో తేలికపాటి డిజైన్ కలిగి ఉంటుంది. ఎయిర్‌పాడ్స్ ప్రోతో టేపర్డ్ సిలికాన్ టిప్స్, చెమట, నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. ఈ ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్ కేస్‌తో మొత్తం 24 గంటల కన్నా ఎక్కువ సేపు వీటిని వినియోగించవచ్చు.
ఎయిర్‌పాడ్స్ ప్రో పారదర్శకత మోడ్‌ను కలిగి ఉంది. ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్‌లు, ఇయర్‌బడ్‌ల ప్రో వెర్షన్ ఎక్కువ కాలం వాటిని ఉపయోగించే వినియోగదారులకు చాలా ఇష్టమైనవిగా చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రోని రూ. 323కి పొందవచ్చు. అయితే ఇప్పటివరకు ప్రీమియం టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌లో అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో లాంచ్ సమయంలో రూ. 26,990గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఇయర్‌బడ్స్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 22,400 తగ్గింపు తర్వాత రూ. 323కి కొనుగోలు చేయవచ్చు.
క్రిస్మస్ సందర్భంగా ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోపై భారీ తగ్గింపు అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.22,723గా ఉంది. కొనుగోలుదారులు ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ధరను మరింత తగ్గించవచ్చు. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ మీ వద్ద పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడానికి రూ. 21,900 వరకు తగ్గింపును అందిస్తోంది. తద్వారా ఇయర్‌బడ్స్ ధరను రూ. 823కి తగ్గించింది. దీనికి అదనంగా, కొనుగోలుదారులు రూ. 6 నెలలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై 500 తగ్గింపు పొందవచ్చు. అంటే.. మీరు ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రోని ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ. 323కి పొందవచ్చు.