Vontimitta
-
#Andhra Pradesh
TDP : వైసీపీకి మరో షాక్.. ఒంటిమిట్టలో టీడీపీ విజయం
ఇక, పులివెందుల, ఒంటిమిట్ల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,050 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ ఓటమితో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోయారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఇది మరింత ఉత్సాహాన్ని అందించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Published Date - 01:08 PM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu : రేపు ఒంటిమిట్ట రాముని కళ్యాణోత్సవం..పట్టు వస్త్రాలు, సమర్పించనున్న సీఎం చంద్రబాబు
రేపు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున రాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనడానికి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపకు రానున్నారు.
Published Date - 12:11 PM, Thu - 10 April 25 -
#Devotional
Vontimitta: నేటితో ముగియనున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు, ధ్వజారోహణంతో సమాప్తం
Vontimitta: కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతంతో ఆలయంలో స్వామిని మేల్కొలిపి ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి శ్రీ సీతారామలక్ష్మణస్వామివారు ప్రత్యేక పల్లకిపై పుష్కరిణికి, ప్రత్యేక పల్లకిపై శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ కు ఊరేగారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.15 గంటల వరకు […]
Published Date - 03:48 PM, Thu - 25 April 24 -
#Devotional
Vontimitta: అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం, వేలాదిగా హాజరైన భక్తులు
Vontimitta: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 5.30 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. రాత్రి 6 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు కంకణబట్టర్ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా […]
Published Date - 09:26 PM, Mon - 22 April 24 -
#Devotional
Vontimitta: వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని వైభవం
Vontimitta: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. పురాణాల ప్రకారం.. జలప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ చిన్న శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోటిలో […]
Published Date - 12:11 AM, Sat - 20 April 24 -
#Devotional
Vontimitta: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే
Vontimitta: ఏప్రిల్ 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏప్రిల్ 16న సాయంత్రం – అంకురార్పణ, 17వ తేదీన ఉదయం – ధ్వజారోహణం(మీథున లగ్నం) సాయంత్రం – శేష వాహన సేవ, 18న ఉదయం – వేణుగానాలంకారము, సాయంత్రం – హంస వాహన సేవ, 19న ఉదయం – వటపత్రశాయి అలంకారము, […]
Published Date - 06:52 PM, Sat - 13 April 24 -
#Devotional
TTD: ఏప్రిల్ 22న ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు
TTD: ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పగడ్భంది ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్సీ సిదార్థ కౌశల్ తో కలసి శుక్రవారం ఈవో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పిఏసిలోని సమావేశ హాలులో ఈవో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఏప్రిల్ […]
Published Date - 07:46 PM, Fri - 12 April 24 -
#Devotional
Vontimitta Temple: ఆంధ్రా అయోధ్యగా ‘ఒంటిమిట్ట రామాలయం’
ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు. అలాంటి అరుదైన ఆలయమే ఒంటిమిట్ట రామాలయం.
Published Date - 11:23 AM, Tue - 30 May 23