Vontimitta: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే
- By Balu J Published Date - 06:52 PM, Sat - 13 April 24
Vontimitta: ఏప్రిల్ 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఏప్రిల్ 16న సాయంత్రం – అంకురార్పణ, 17వ తేదీన ఉదయం – ధ్వజారోహణం(మీథున లగ్నం) సాయంత్రం – శేష వాహన సేవ, 18న ఉదయం – వేణుగానాలంకారము, సాయంత్రం – హంస వాహన సేవ, 19న ఉదయం – వటపత్రశాయి అలంకారము, సాయంత్రం – సింహ వాహన సేవ, 20న ఉదయం – నవనీత కృష్ణాలంకారము, సాయంత్రం – హనుమత్సేవ, 21న ఉదయం – మోహినీ అలంకారము, సాయంత్రం – గరుడసేవ జరగనుంది.
22న ఉదయం – శివధనుర్భంగాలంకారము, సాయంత్రం – కళ్యాణోత్సవము(సా.6.30- రా.8.30)/ గజవాహనము, 23న ఉదయం – రథోత్సవం, 24న ఉదయం – కాళీయమర్ధనాలంకారము, సాయంత్రం – అశ్వవాహన సేవ, 25న ఉదయం – చక్రస్నానం, సాయంత్రం – ధ్వజావరోహణం, 26న సాయంత్రం – పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Related News
YCP Manifesto : మేనిఫెస్టోలో రుణమాఫీని ఎందుకు చేర్చలేదు.. కారణం ఇదే..?
ఎండాకాలంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఊరటనిస్తోంది.