Telangana Government
-
#Trending
ASSOCHAM : అసోచామ్, తెలంగాణ ప్రభుత్వం ఏఐ & సెక్యూరిటీ సదస్సు
జెన్ AI యుగంలో డేటా రక్షణ, గోప్యతపై దృష్టి కేంద్రీకరించిన కీలక సెషన్‌లు, నేటి డిజిటల్ వాతావరణం లో అవసరమైన ఉత్తమ పద్ధతులు, నియంత్రణ కార్యాచరణ పద్ధతులను వెల్లడించాయి .
Published Date - 06:03 PM, Thu - 20 February 25 -
#Speed News
Price Hike : మద్యం ప్రియులకు మరో బిగ్ షాక్
త్వరలోనే చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుండి 20 శాతం పెరగనునట్లు తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది.
Published Date - 02:13 PM, Thu - 20 February 25 -
#Telangana
Harish Rao : సాగర్ నీటిని ఏపీకి తరలించడంపై చర్యలు తీసుకోవాలి
Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్న నీటిపై చర్యలు తీసుకోవడంపై రేవంత్ రెడ్డి నిద్రిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. 3 నెలలుగా రోజూ సుమారు రెండు టీఎంసీ నీరు ఏపీకి చేరుతున్నదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.
Published Date - 01:56 PM, Thu - 20 February 25 -
#Telangana
Telangana Assembly : మార్చి1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు..!
Telangana Assembly : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతోంది. మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి, ఈ అంశాలపై చర్చించి, మూడు బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లుతో పాటు, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద్య, ఉపాధి రంగాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు కొత్త బిల్లులను చట్టబద్ధం చేయాలని నిర్ణయించింది.
Published Date - 10:27 AM, Thu - 20 February 25 -
#Telangana
LRS Scheme : గత నాలుగేళ్లలో ప్లాట్లు కొన్న వాళ్లకూ ఆ అవకాశం
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ క్రమబద్ధీకరణ పథకం(LRS Scheme) అమలులో వేగాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 08:25 PM, Wed - 19 February 25 -
#Speed News
SC classification : ఎస్సీ వర్గీకరణ కమిషన్ గడువు పెంపు
ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వం ఆమోదించిన నివేదికలో లోపాలను సవరించి అన్ని కులాలకు న్యాయం చేయాలని ఎంఆర్‌పీఎస్ డిమాండ్ చేసింది. అధిక జనాభా ఉన్న మాదిగలకు గ్రూప్ B లో 9 శాతం రిజర్వేషన్ల ఇచ్చారు.
Published Date - 08:27 PM, Tue - 18 February 25 -
#Speed News
High Court : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కుల సంఘాలకు కట్టబెట్టడం కరెక్ట్ కాదని, వెంటనే ఆ జీవో కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు.
Published Date - 08:50 PM, Mon - 17 February 25 -
#Telangana
New Ration Cards : రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారా.. ఇది మీకోసమే..
New Ration Cards : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభించారు. తాజాగా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలను మార్చి మొదటి వారంలో ప్రకటించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే, ప్రజలు రేషన్ కార్డుల జాబితాను వార్డు సభల కంటే ముందే విడుదల చేయాలని కోరుతున్నారు.
Published Date - 10:04 AM, Mon - 17 February 25 -
#Telangana
KTR : రేవంత్ నిర్లక్ష్య పాలనలో విద్యార్థులు డీలా పడిపోతున్నారు..
KTR : సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గురుకులాలు, విద్యా విధానాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 01:04 PM, Sun - 16 February 25 -
#Telangana
Telangana Politics : వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లపై వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు
Telangana Politics : తెలంగాణలో రిజర్వేషన్ విషయంపై రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెలలో శాసనసభలో బీసీ రిజర్వేషన్‌ను 42 శాతం పెంచే బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం. అయితే, ఈ పెంపు 50 శాతం రిజర్వేషన్ సీమాకు మించి వెళ్ళిపోతుండటంతో, కేంద్రం నుంచి అనుమతి పొందడం అవసరం అవుతుంది.
Published Date - 12:38 PM, Sun - 16 February 25 -
#Telangana
MLC Kavitha : రేవంత్‌వి అన్నీ దొంగ మాటలే..
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసినట్టు ఖమ్మంలో జరిగిన పర్యటనలో వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, త్రిబుల్ ఆర్ రైతుల బాధలు పట్టించుకోవడంలో విఫలమయ్యారని ఆమె అన్నారు. శనివారం ఖమ్మంలో లక్కినేని సురేందర్‌ను పరామర్శించిన కవిత, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కౌంటర్లను కూడా వేశారు.
Published Date - 02:22 PM, Sat - 15 February 25 -
#Telangana
Kishan Reddy : తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సవాల్.. బడ్జెట్‌లో నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా
Kishan Reddy : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరి, కేంద్రం నుండి తెలంగాణకు కేటాయించిన నిధులపై బహిరంగ చర్చ జరపాలని కోరారు. ఆయన, జాతీయ రహదారుల అభివృద్ధి, మెగా టెక్స్ టైల్ పార్క్, రైల్వే కోచ్ వంటి ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చినట్లు వివరించారు.
Published Date - 02:01 PM, Sat - 15 February 25 -
#Telangana
Aadi Srinivas : విషయం తెలియకుండా విమర్శలా.. దుష్ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ హరీష్ రావు
Aadi Srinivas : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధపు ఆరోపణలు చేయడంలో ఎవరినీ మించిపోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. రైతు భరోసా నిధుల పంపిణీపై హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
Published Date - 12:40 PM, Wed - 12 February 25 -
#Telangana
Minister Seethakka : కేటీఆర్‌కు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు
Minister Seethakka : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబం సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనకుండానే ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదని మంత్రి సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుల గణనపై బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని, రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారని ఆమె తెలిపారు.
Published Date - 11:48 AM, Wed - 12 February 25 -
#Telangana
Harish Rao : ఇది ప్రజా పాలనా? ఇది ప్రజా వ్యతిరేక పాలన..!
Harish Rao : హరీష్ రావు తన ట్వీట్‌లో, "చిన్న జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు, జీతాల జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల జీతం లేకుండా వారు దైనందిన జీవితాన్ని కొనసాగించడం ఎంతటి కష్టమో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. బ్యాంకుల ఈఎంఐలు (EMI) చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్నారు." అని పేర్కొన్నారు.
Published Date - 10:10 AM, Wed - 12 February 25