HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >If Caste Census Is Not Maintained Bc Will Lose Cm Revanth Reddy

BC Census Survey : కులగణనను కాపాడుకోకపోతే బీసీలే నష్టపోతారు : సీఎం రేవంత్‌ రెడ్డి

రాహుల్‌ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని సీఎం అన్నారు. రాహుల్‌ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు. ఈ మేరకు బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తిపై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.

  • Author : Latha Suma Date : 22-02-2025 - 4:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
If caste census is not maintained, BC will lose: CM Revanth Reddy
If caste census is not maintained, BC will lose: CM Revanth Reddy

BC Census Survey : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీసీ కులగణన సర్వే చేపట్టడం ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని అన్నారు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారన్నారు. రాహుల్‌ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని సీఎం అన్నారు. రాహుల్‌ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు. ఈ మేరకు బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తిపై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.

Read Also: Israel-Hamas : మరో ఆరుగురు బందీలను విడుదల చేయనున్న హమాస్‌

కులగణన తప్పు అయితే ఎక్కడ తప్పు ఉందో చూపించండి అని బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కులగణన సర్వే రాహుల్ గాంధీ మనకు ఇచ్చిన ఆస్తి. దానిని మీరు కాపాడుకోకపోతే మీకే నష్టం అని క్లాస్ తీసుకున్నారు. కట్టే పట్టుకొని కాపాడుకోండి. అంతా రేవంత్ రెడ్డే చూసుకుంటాడు. దేశంలో ఏ సీఎం చేయని సాహసం చేస్తున్నానని తెలిపారు. రాహుల్ గాంధీ హామీ మేరకే చిత్తశుద్ధితో పని చేస్తున్నానని చెప్పారు.

అన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగితీరుతుంది. కులగణనను కాపాడుకోకపోతే.. బీసీలే నష్టపోతారు. ఇంత పకడ్బందీగా సర్వే చేసిన రాష్ట్రం ఇకపై కూడా మరొకటి ఉండదు అని సీఎం అన్నారు. నివేదిక ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సూచనలు ఇవ్వాలని బీసీ సంఘాల నేతలను కోరారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యాచరణపై సూచనలివ్వాలని కోరారు. బీసీ జనాభా ప్రకారం వారికి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.గతంలో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారు. కేసీఆర్ లెక్కల ప్రకారం.. 51 శాతం.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 56.33 శాతానికి పైగా ఉన్నారు. మేము అత్యంత పకడ్బందీగా సర్వే నిర్వహించామన్నారు. ఇంటి యజమానులు చెప్పిన లెక్కలే మా దగ్గర ఉన్నాయి. 1.12 కోట్ల కుటుంబంలో సర్వేలో పాల్గొన్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Loan Foreclosure Charges: బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్..!

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BC Census Survey
  • CM Revanth Reddy
  • kcr
  • rahul gandhi
  • telangana government

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

  • Kavitha warns the Congress government.

    Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

  • CM Revanth Reddy issues a strong warning to KTR.

    Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • Massive arrangements for the Farmers' Blessing Meeting

    Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Green signal for Musi rejuvenation; government approves ₹7,000 crore project.

    Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd