Tamil Nadu Politics
-
#India
TVK: టీవీకే పార్టీలోకి 35 మంది ఎమ్మెల్యేలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాలను గెలుచుకున్న అన్నాడీఎంకేలో ఇప్పుడు భారీ ‘ముసలం’ మొదలైంది. పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్ వైపు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చెన్నైలోని పార్టీ సీనియర్ నేత సీవీ షణ్ముగం కార్యాలయంలో సుమారు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి […]
Date : 06-05-2026 - 12:07 IST -
#India
AIADMK: తమిళ్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ
తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారిన అన్నాడీఎంకేలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నేడు చెన్నైలో జరగాల్సిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం అకస్మాత్తుగా రద్దయింది. టీవీకేకు మద్దతిచ్చే అంశంపై పార్టీలో తీవ్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ పరిణామం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో అతిపెద్ద […]
Date : 06-05-2026 - 11:00 IST -
#India
TVK: టీవీకే కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, డీఎంకే-అన్నాడీఎంకేల ఆధిపత్యానికి గండికొట్టిన నటుడు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం'(టీవీకే)కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చే అధికారాన్ని తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి (టీఎన్‌సీసీ) అప్పగించినట్లు కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ […]
Date : 06-05-2026 - 9:42 IST -
#India
TVK vijay: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌తో కలిసొచ్చేది ఎవరు.?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితాలు వెలువడ్డాయి. 234 స్థానాలున్న అసెంబ్లీలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో హంగ్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే మూడు ప్రధాన మార్గాలపై దృష్టి సారించి, […]
Date : 05-05-2026 - 3:55 IST -
#South
MK Stalin: విజయ్ కూ, తమకూ 17.43 లక్షల ఓట్ల తేడా: స్టాలిన్
విజయ్ టీవీకే పార్టీకి, తమకు మధ్య ఓట్ల వ్యత్యాసం 3.52 శాతమేనని డీఎంకే పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి సందేశం పంపించారు. நடந்து முடிந்த தமிழ்நாடு சட்டமன்றப் பொதுத் தேர்தலில் திராவிட முன்னேற்றக் கழகத்தின் தலைமையிலான மதச்சார்பற்ற முற்போக்குக் கூட்டணிக் கட்சியின் வேட்பாளர்களுக்கு வாக்களித்த தமிழ்நாட்டு மக்கள் அனைவருக்கும் எனது மனமார்ந்த நன்றியை உண்மை உணர்வுடன் தெரிவித்துக் கொள்கிறேன். […]
Date : 05-05-2026 - 3:20 IST -
#South
M.K. Stalin: సీఎం పదవికి రాజీనామా చేసిన ఎం.కె. స్టాలిన్
తమిళనాడులో రాజకీయ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది. దశాబ్దాలుగా తమిళగడ్డను గుప్పెట్లో పెట్టుకుని శాసించిన ద్రవిడ పార్టీల (డీఎంకే, అన్నాడీఎంకే) కంచుకోటలు బద్దలయ్యాయి. సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ రెండేళ్లలోనే తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకుంది. తమిళ ఓటర్లు, ముఖ్యంగా జెన్ జీ యువత విజయ్ కు పట్టం కట్టారు. వరుసగా రెండు సార్లు సీఎంగా అధికారిన్ని చలాయించిన స్టాలిన్ తీవ్ర పరాభవాన్ని మూటకట్టుకున్నారు. డీఎంకే పార్టీ రెండో స్థానానికి పరిమితం అయింది. ఎవరూ ఊహించని విధంగా […]
Date : 05-05-2026 - 12:57 IST -
#India
TVK: ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌కు లేఖ రాసిన విజయ్
నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ‘దళపతి’ విజయ్, తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ, తొలిసారి పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. దీంతో తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడగా, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. […]
Date : 05-05-2026 - 11:04 IST -
#News
TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?
TVK తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఈ పార్టీ, ఊహించని రీతిలో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అనూహ్య విజయం నేపథ్యంలో ప్రముఖ కథానాయిక త్రిష రాజకీయ ప్రవేశంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. టీవీకే తరఫున ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు విజయ్ రెండు నియోజకవర్గాల […]
Date : 05-05-2026 - 10:38 IST -
#News
MK Stalin: కేంద్రం డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం నిరసన
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నమక్కల్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బిల్లు కాపీని స్వయంగా దహనం చేసి తన వ్యతిరేకతను బలంగా చాటారు. ఈ బిల్లును ‘నల్ల చట్టం’గా అభివర్ణించిన ఆయన, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా, తమిళనాడులోని ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ కోరారు. చెన్నై గోపాలపురంలోని దివంగత […]
Date : 16-04-2026 - 11:27 IST -
#News
MK Stalin: డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్.
నియోజకవర్గాల పునర్విభజన అంశంలో తమిళనాడు అభిప్రాయాలను పట్టించుకోకపోతే బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఆయన ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన పేరుతో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. దేశాభివృద్ధికి కృషి చేసినందుకు గాను కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తుందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి […]
Date : 15-04-2026 - 3:02 IST -
#News
ఉదయనిధి vs కనిమొళి.. డీఎంకేలో వారసత్వ పోరు.. నెక్స్ట్ సీఎం ఎవరు?
Kanimozhi vs Udhayanidhi Stalin తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో వారసత్వ పోరు బహిర్గతమైంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన తనయుడు ఉదయనిధిని రాజకీయ వారసుడిగా నిలబెట్టాలని చూస్తుండగా, ఆయన సోదరి, ఎంపీ కనిమొళి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇది పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల తిరునెల్వేలి జిల్లా పాళయంగోట్టయ్‌లో జరిగిన ప్రచార సభలో ఈ పరిణామం స్పష్టంగా కనిపించింది. డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రసంగించేందుకు కనిమొళి వేదిక వద్దకు రాగానే, ఆమె మద్దతుదారులు […]
Date : 04-04-2026 - 12:33 IST -
#South
TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్
Tamil Nadu Elections తమిళనాడు రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్, సోమవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. చెన్నైలోని వ్యాసర్పాడిలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారికి విజయ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. […]
Date : 30-03-2026 - 2:11 IST -
#South
ఈ ఎన్నికలో నాకు , స్టాలిన్‌కు మధ్య యుద్ధమే : విజయ్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలకు సంబంధించినవి కావని అవి పూర్తిగా రాష్ట్రంలోని అవినీతి, పాలన, ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు.
Date : 23-02-2026 - 4:41 IST -
#South
స్టాలిన్ పాలనపై విజయ్ ఘాటు వ్యాఖ్యలు ఫైర్
Tamilaga Vettri Kazhagam ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలకు సంబంధించినవి కావని, రాష్ట్రంలోని అవినీతి, పాలనకు సంబంధించినవని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు విజయ్, స్టాలిన్‌ల మధ్య ప్రత్యక్ష పోరాటమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వెల్లూరు జిల్లా కొల్లమంగళంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో జరిగిన అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడారు. “స్పష్టంగా […]
Date : 23-02-2026 - 3:50 IST -
#South
దళపతి విజయ్ అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధం.. ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారంటే..?
రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో రాజకీయ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఆయన పేరులోని తొలి అక్షరం ‘V’ కావడంతో అదే అక్షరంతో ప్రారంభమయ్యే నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సెంటిమెంట్ దృష్ట్యా ‘వి’ అక్షరంతో ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని ఓ జ్యోతిష్యుడు సూచించాడన్న ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అలాంటి […]
Date : 12-02-2026 - 9:07 IST