HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Congress Decides To Support Tvk

TVK: టీవీకే కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం!

  • Author : Vamsi Chowdary Korata Date : 06-05-2026 - 9:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Support from Congress for TVK Vijay
Support from Congress for TVK Vijay

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, డీఎంకే-అన్నాడీఎంకేల ఆధిపత్యానికి గండికొట్టిన నటుడు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం'(టీవీకే)కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చే అధికారాన్ని తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి (టీఎన్‌సీసీ) అప్పగించినట్లు కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ తెలిపారు. విజయ్ ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్డీయే లేదా దాని మిత్రపక్షాలతో కలవకూడదనే షరతును కాంగ్రెస్ పెట్టింది.

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. మెజారిటీకి కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న 5 సీట్లతో వారి బలం 113కు చేరింది. త్వరలోనే గవర్నర్‌ను కలిసి మద్దతు లేఖను సమర్పించనున్నారు. దీంతో విజయ్ రేపటికల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.

కాంగ్రెస్ తాజా నిర్ణయంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నమైంది. ఈ పరిణామంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. ఇది ‘వెన్నుపోటు’ అని డీఎంకే అధికార ప్రతినిధి ఎ. శరవణన్ ఆరోపించారు. తమ మద్దతు లేకుండా కాంగ్రెస్ ఆ ఐదు సీట్లు కూడా గెలిచేది కాదని ఆయన విమర్శించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress support
  • political alliance
  • rahul gandhi
  • tamil nadu politics
  • Tamilaga Vettri Kazhagam
  • Vijay thalapathy

Related News

Shock to AIADMK: Three MLAs Resign

AIADMK: అన్నాడీఎంకేకు షాక్‌..ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో (టీవీకే) చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా

  • Nirmala Sitharaman Makes Key Remarks on Economic Challenges

    Nirmala Sitharaman: ఆర్థిక సవాళ్లపై నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు

  • 10-Year-Old Girl Kidnapped and Murdered in Coimbatore... CM Vijay Shares Emotional Post!

    Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

Latest News

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd