HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >M K Stalin Resigns As Chief Minister

M.K. Stalin: సీఎం పదవికి రాజీనామా చేసిన ఎం.కె. స్టాలిన్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 05-05-2026 - 12:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Stalin Resign
Stalin Resign

తమిళనాడులో రాజకీయ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది. దశాబ్దాలుగా తమిళగడ్డను గుప్పెట్లో పెట్టుకుని శాసించిన ద్రవిడ పార్టీల (డీఎంకే, అన్నాడీఎంకే) కంచుకోటలు బద్దలయ్యాయి. సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ రెండేళ్లలోనే తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకుంది. తమిళ ఓటర్లు, ముఖ్యంగా జెన్ జీ యువత విజయ్ కు పట్టం కట్టారు. వరుసగా రెండు సార్లు సీఎంగా అధికారిన్ని చలాయించిన స్టాలిన్ తీవ్ర పరాభవాన్ని మూటకట్టుకున్నారు. డీఎంకే పార్టీ రెండో స్థానానికి పరిమితం అయింది. ఎవరూ ఊహించని విధంగా కొళత్తూర్ నియోజకవర్గంలో స్టాలిన్ 9 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయం పాలవడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్‌కు పంపించారు. మరోవైపు, తాజా ఫలితాల ప్రకారం ఏ పార్టీకి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది.

72 స్థానాలు సాధించిన డీఎంకే కూటమి, 53 స్థానాల్లో నిలిచిన అన్నాడీఎంకేలను కాదని, మెజారిటీకి అవసరమైన మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టే పనిలో విజయ్ నిమగ్నమయ్యారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై పార్టీ నేతలతో కీలక చర్చలు జరుపుతున్న విజయ్… ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. అతిపెద్ద పార్టీగా ఉన్న తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2026 Assembly elections
  • 2026 Tamil Nadu Elections
  • CM MK Stalin
  • dmk
  • resign
  • tamil nadu politics
  • TVK Party

Related News

Raghava Lawrence clarifies stance on political entry

Raghava Lawrence: రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ

ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించి తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా ఆ జాబితాలో ఇప్పుడు లారెన్స్ కూడా చేరారు. Do your duty sincerely, without expecting anything in return. After watching this video, please share your a

    Latest News

    • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

    • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • Meta : ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్!

    • TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd