Corona
-
#Health
Corona: ఈ లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోండి
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజు వారీ కేసులు 20 వేలను దాటేశాయి. డెల్టా వేరియంట్ కు తోడు ఒమిక్రాన్ వేరియంట్ కూడా పంజా విసురుతోంది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల తీవ్రత బీభత్సంగా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన, రుచి కోల్పోవడం, అలసట, విరేచనాలతో బాధపడుతుంటే కనుక వారికి కరోనా సోకినట్టు భావించాలని… […]
Date : 01-01-2022 - 12:27 IST -
#Health
Corona: పిల్లల టీకా- రిజిస్ట్రేషన్ ప్రారంభం
దేశంలో 15-18 ఏళ్ల వయసులోపు పిల్లలకు కొవిడ్ టీకా పంపిణీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. టీకా వేయించుకోవాలనుకునే పిల్లల పేర్లను కొవిన్ యాప్‌లో నమోదు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రెజిస్ట్రేషన్ చేసుకున్నవారికి జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గతవారం తెలిపిన విషయం తెలిసిందే. 60 ఏళ్ల వయసు […]
Date : 01-01-2022 - 11:49 IST -
#Health
America: కరోనా కేసులతో అమెరికా విలవిల..
కరోనావైరస్ ధాటికి అగ్రదేశం అమెరికా వణికిపోతోంది. కొత్త వేరియంట్ రాకతో అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దాదాపు 5.8 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. రానున్న వారాల్లో ఒమిక్రాన్ తుపాను దేశాన్ని ముంచెత్తనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో అగ్రదేశంలో చిన్నారులు రికార్డు స్థాయిలో ఆసుపత్రుల్లో చేరుతుండటం కలవరపెడుతోంది. ఇప్పుడు మనకు నివారించే మార్గాలున్నాయి అని వైద్యులు అభిప్రాయపడ్డారు. చిన్నారులకు టీకాలు అందించాల్సిన ఆవశ్యకతను నిపుణులు గుర్తుచేస్తున్నారు. డిసెంబర్ 22 నుంచి 28 […]
Date : 31-12-2021 - 3:05 IST -
#India
18.16 lakh cases: వామ్మో.. ఒకరోజు ఇన్ని లక్షల కేసులా?
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Date : 31-12-2021 - 12:02 IST -
#Covid
Corona: దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో రెట్టింపైన కరోనా కేసులు..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు గడిచిన రెండు రోజుల్లో రెట్టింపయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 13,154 కేసులు కొత్తగా నమోదుకాగా.. 268 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కేసులు 6,242 మాత్రమే. దీంతో పోలిస్తే బుధవారం నటి కేసులు రెట్టింపైనట్టు తెలుస్తోంది. మంగళవారం నాటి కేసుల సంఖ్య 9,155. వరుసగా రెండు రోజుల పాటు కేసులు పెరగడం అసాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. వారాంతంలో టెస్టులు తక్కువగా చేయడం వల్ల సోమవారం కేసులు తగ్గి ఉండొచ్చని మరో వాదన వినిపిస్తోంది. […]
Date : 30-12-2021 - 10:25 IST -
#India
Doctors’ Protest : కేజ్రీ, మోడీ నడుమ డాక్టర్ల సమ్మె
ఆస్పత్రులను బహిష్కరించిన వైద్యల అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాతపూర్వకంగా తీసుకెళ్లాడు. ఆస్పత్రుల్లో ఉండాల్సిన డాక్టర్లు రోడ్లపై ఉన్నారనే విషయాన్ని ప్రధానికి నివేదించాడు.
Date : 29-12-2021 - 3:52 IST -
#Health
Delhi: ఎల్లో అలర్ట్‌తో అమల్లోకి రానున్న ఆంక్షలివే..
కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీ వ్యాప్తంగా ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసిన సర్కారు.. మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా దిల్లీలో పాజిటివిటీ రేటు 0.5శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల, వైరస్ కట్టడికిగానూ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవల్ -1(ఎల్లో అలర్ట్)ను అమలు చేయాలని నిర్ణయించాం. మరిన్ని ఆంక్షలు విధిస్తాం […]
Date : 28-12-2021 - 4:58 IST -
#Health
కోవిడ్ నియంత్రణ కోసం సిప్లా యాంటీ వైరల్ డ్రగ్
తేలికపాటి నుండి మితమైన కోవిడ్ -19 చికిత్సకు యాంటీ-వైరల్ డ్రగ్ అయిన మోల్నుపిరవిర్‌ను విడుదల చేయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఇయుఎ) అనుమతిని మంజూరు చేసినట్లు సిప్లా లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది.
Date : 28-12-2021 - 2:23 IST -
#Health
Corona: కొత్తగా రెండు వాక్సిన్ లకు, ఒక మాత్రకు అనుమతులు- కేంద్రం
సెంట్రల్ డ్రగ్ అథారిటీ రెండు కోవిడ్ వ్యాచ్సిన్ లకు, ఒక మాత్రకు అనుమతులు జారీ చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖా మంత్రి మాన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా తెలిపారు. సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా తాయారు చేసిన కావోవ్యక్స్(వాక్సిన్), బయోలాజికల్ E వారి కోర్బెవ్యక్స్ (వాక్సిన్), యాంటీ కోవిడ్ పిల్(మాత్ర)కు మంగళవారం అనుమతులు జారీ చేసింది. కాగా 18 సంవత్సరాలలోపు వారు మాత్రమే వీటిని తీసుకోవాలని హెచ్చరించింది. యాంటీ కోవిద్ పిల్ ను దేశవ్యాప్తంగా 13 కంపెనీలు […]
Date : 28-12-2021 - 12:40 IST -
#Health
Corona: పిల్లల టికాకు అంతా సిద్ధం- కేంద్రం
కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, తాజాగా ఒమిక్రాన్ నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకాకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా) అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 1 నుంచి కొవిన్ యాప్‌లో ప్రారంభమవుతుందని కేంద్రం ప్రకటించింది. ఆధార్ కార్డుతో కొవిన్ […]
Date : 28-12-2021 - 10:20 IST -
#Health
Omicron In TS:తెలంగాణాలో మళ్ళీ 12 ఓమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు తేలాయి. వీరిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Date : 27-12-2021 - 11:35 IST -
#Health
Omicron : 10 రాష్ట్రాలకు కోవిడ్ బృందాలు పంపిన కేంద్రం
అత్యధిక ఓమిక్రాన్ కేసులు, తక్కువ వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపిస్తోంది. దేశంలోని 10 రాష్ట్రాలకు “మల్టీ డిసిప్లినరీ సెంట్రల్ టీమ్‌లను” మోహరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
Date : 25-12-2021 - 4:20 IST -
#Speed News
Delhi: ఢిల్లీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి
ఢిల్లీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. మొత్తం 148.33 లక్షల మంది అర్హత ఉన్న జనాభాకు వ్యాక్సిన్ మొదటి డోసు వేసినట్లు ట్వీట్ చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి , అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇతర అధికారులకు ధన్యవాదాలు చెబుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒమైక్రాన్ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు అనుమతినీయలేదు. 👏👏Delhi completes first dose to 100% eligible people – 148.33 […]
Date : 24-12-2021 - 5:37 IST -
#Cinema
Kamal: తుది దశలో కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 232వ సినిమా విక్రమ్ సినిమా డిసెంబర్ 10 నుంచి ఫుల్ స్వింగ్‌లో ఉంది. నేడు కమల్ హాసన్ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు.
Date : 23-12-2021 - 12:34 IST -
#Speed News
China: లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం
చైనా లోని జియాన్ ప్రాతంలో గురువారం నుండి లాక్ డౌన్ విధించనున్నారు. చైనాలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. డెల్టా వేరియెంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో దాదాపు కోటి 30 లక్షల మంది ప్రజలు లాక్ డౌన్లో ఉండనునట్టు అంచనా. నిత్యావసర సరుకులకోసం, ఇతర ఎమర్జెన్సీ సమయాల్లో ఒక కుటుంబం నుండి కేవలం ఒక వ్యక్తినే అనుమతించనున్నారు. […]
Date : 23-12-2021 - 12:21 IST