America News
-
#World
Road Accident in America: అమెరికాలో యాక్సిడెంట్.. తెలుగు యువతి దుర్మరణం
అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏపీకి చెందిన యువతి ప్రాణాలు కోల్పోయింది. వేగంగా వచ్చిన పోలీస్ కారు యువతిని ఢీకొట్టటంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది.
Published Date - 01:27 PM, Wed - 25 January 23 -
#World
Nine Killed: అమెరికాలోని మరోసారి కాల్పుల మోత.. 9 మంది మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలోని దారుణం జరిగింది. మాంటెరీ పార్క్‌లో శనివారం రాత్రి జరిగిన చైనీస్ న్యూ ఇయర్ వేడుకకు వేలాదిగా ప్రజలు వచ్చారు. ఈ వేడుకలో దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు. ఈ ఘటనలో కనీసం 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
Published Date - 04:53 PM, Sun - 22 January 23 -
#World
Nikki Haley: అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి మహిళ..?
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (US President Joe Biden) రహస్య పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో 2024 ఎన్నికలపై అప్పుడే చర్చ మొదలయింది. తాను అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు రిపబ్లికన్ పార్టీ నేత, భారతీయ- అమెరికన్ అయిన నిక్కీ హెలీ (Nikki Haley) హింట్ ఇచ్చారు.
Published Date - 09:19 AM, Sat - 21 January 23 -
#World
Ro Khanna Profile: అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి వ్యక్తి.. ఎవరీ రో ఖన్నా..?
అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేందుకు భారత సంతతికి చెందిన రో ఖన్నా (Ro Khanna) సిద్ధం అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Published Date - 07:55 AM, Sun - 15 January 23 -
#World
US House Speaker: అమెరికా దిగువ సభ స్పీకర్ గా కెవిన్ మెక్‌కార్తీ
అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్)లోని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(దిగువ సభ)కు స్పీకర్ గా రిపబ్లికన్ నేత కెవిన్ మెక్‌కార్తీ (Kevin McCarthy) ఎన్నికయ్యారు. 4 రోజులుగా జరుగుతున్న ఓటింగ్ లో 15వ రౌండ్ తర్వాత మెక్‌కార్తీ విజయం సాధించారు.
Published Date - 02:11 PM, Sat - 7 January 23 -
#World
Boy Shoots Teacher: టీచర్ పై ఆరేళ్ల కుర్రాడి కాల్పుల కలకలం
అమెరికా (America)లోని వర్జీనియాలోని ఓ పాఠశాలలో ఆరేళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో టీచర్ పై చిన్నారి కాల్పులు (Boy Shoots Teacher) జరిపాడు. అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరిగిపోతోంది. వర్జీనియాలోని రిచ్ నెక్ ఎలిమెంటరీ స్కూల్ లో తాజాగా విస్తుపోయే ఘటన జరిగింది.
Published Date - 09:26 AM, Sat - 7 January 23 -
#World
US Man Kills Family: అమెరికాలో దారుణం.. కుటుంబసభ్యులని కాల్చి చంపిన భర్త
అమెరికాలో దారుణం జరిగింది. భార్య విడాకులకు దరఖాస్తు చేసిందనే కోపంతో భర్త మృగంలా మారాడు. భార్యతో సహా ఏడుగురు కుటుంబసభ్యులను కాల్చి (US Man Kills Family) చంపాడు. ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురితో కూడిన తన కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపాడో వ్యక్తి.
Published Date - 07:27 AM, Sat - 7 January 23 -
#World
Donald Trump Gets One Vote: అమెరికా దిగువ సభ స్పీకర్ ఎన్నికలో అనూహ్య ఘటన.. ట్రంప్ కి ఒకే ఒక ఓటు
అమెరికా దిగువ సభ స్పీకర్ ఎన్నికలో అనూహ్య ఘటన జరిగింది. స్పీకర్ పదవికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరును రిపబ్లికన్ పార్టీ నేత మాట్ గేట్జ్ ప్రతిపాదించారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించగా.. ట్రంప్ పేరుకు అనుకూలంగా ఒకే ఒక్క ఓటు పోలైంది. అది కూడా నామినేట్ చేసిన రిపబ్లికన్ నేత మాట్ గేట్జ్ వేసిందే.
Published Date - 06:54 AM, Sat - 7 January 23 -
#World
Bomb cyclone: అమెరికాలో తుఫాను బీభత్సం.. 18 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాను బాంబ్ సైక్లోన్ (Bomb cyclone) వణికిస్తోంది. మంచు తుపానుతో ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
Published Date - 09:45 AM, Sun - 25 December 22 -
#World
America: అమెరికాలో 2 వేలకుపైగా విమానాలు రద్దు.. కారణమిదే..?
క్రిస్మస్ సెలవులకు ముందు ప్రతికూల వాతావరణం అమెరికా (America) ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. మంచు, వాన, గాలి, శీతల ఉష్ణోగ్రతలతో అమెరికా (America) అంతటా విమాన సర్వీసులతోపాటు బస్సు, అమ్‌ట్రాక్ ప్యాసింజర్ రైలు వంటి ప్రజారవాణా సేవలకు అంతరాయం కలుగుతుంది.
Published Date - 08:15 AM, Fri - 23 December 22 -
#World
NRI Boy: గోల్డెన్ గేట్ వంతెన మీది నుంచి దూకి విద్యార్థి సూసైడ్
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వంతెనపై నుండి భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ యువకుడు (NRI Boy) సముద్రంలోకి దూకాడు. ఇది అతని మరణానికి కారణమైంది. వంతెనపై మోహరించిన యుఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది రెండు గంటల ప్రయత్నం తర్వాత బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.
Published Date - 11:50 AM, Thu - 15 December 22 -
#World
President Biden: వారికి గుడ్ న్యూస్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బైడెన్
అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహానికి ఆమోదం లభించింది. అమెరికా పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన గే మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్( President Biden) మంగళవారం సంతకం చేశారు. స్వలింగ వివాహాలకు ప్రభుత్వ గుర్తింపునిచ్చే చట్టాన్ని ఆమోదిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ (President Biden) మంగళవారం సంతకం చేశారు.
Published Date - 07:44 AM, Wed - 14 December 22