Telangana
-
#Telangana
ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడా అనుసంధానిస్తూ, ఏఐ ప్రమాణాలకు ‘మార్గదర్శక శక్తి’గా నిలుస్తోంది” అని ఆయన అన్నారు. “ది మెరిడియన్ […]
Date : 08-07-2026 - 3:24 IST -
#Telangana
Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్
తెలంగాణలో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జరిగిన భారీ అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన దాదాపు 8 లక్షల భూ లావాదేవీలపై నిపుణుల కమిటీ సమగ్ర ఆడిట్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం లావాదేవీలలో దాదాపు 22,000 రిజిస్ట్రేషన్లలో తీవ్రమైన తేడాలు మరియు నిబంధనల ఉల్లంఘనలు […]
Date : 08-07-2026 - 11:06 IST -
#Telangana
Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సింగరేణికి మరో రెండు కీలక బొగ్గు బ్లాక్‌లు దక్కనున్నాయి. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌తో పాటు తాడిచెర్ల-2 కోల్ బ్లాక్‌ను కూడా సింగరేణికి కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తుకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పారు. ఢిల్లీలో మంగళవారం మాట్లాడిన కిషన్ రెడ్డి సింగరేణికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ సింగరేణికి […]
Date : 07-07-2026 - 4:45 IST -
#Telangana
Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం
తెలంగాణ సంస్కృతి, కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవానికి కేంద్రమైన ములుగు జిల్లాలో మరో చారిత్రక మైలురాయి నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని పురాతన చారిత్రక శివాలయానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ గుర్తింపు ఇచ్చింది. ఈ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడంగా (National Monument Status) గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆలయ పరిసర ప్రాంతాలను, దాని పరిధిని ఇకపై “జాతీయ సంపద”గా పరిగణించనున్నారు. ఇప్పటికే ఈ […]
Date : 07-07-2026 - 1:57 IST -
#Speed News
GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌లో కొత్త రూల్స్ ..!
దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.
Date : 05-07-2026 - 3:22 IST -
#Telangana
Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్
అర్హత ఉన్న వారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 48 గంటల్లోనే కార్డు జారీ చేసే విధంగా వ్యవస్థను సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, పారదర్శకంగా మరియు వేగవంతంగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Date : 05-07-2026 - 2:26 IST -
#Telangana
KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్
కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నీళ్లు అందుబాటులో ఉన్నా రైతులకు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
Date : 05-07-2026 - 12:13 IST -
#Telangana
New Pension : తెలంగాణలో పెన్షన్లకు భారీ ప్రక్షాళన .. కొత్తగా లక్ష పెన్షన్లు..!
రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ఆసరా పెన్షన్ల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, నిజమైన అర్హులైన పేదలకు ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Date : 05-07-2026 - 10:23 IST -
#Telangana
Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!
తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో అధికారిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా.. జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు జిల్లా కలెక్టర్ తీపి కబురు అందించారు. జిల్లాలోని ICDS ప్రాజెక్టుల పరిధిలో సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, […]
Date : 30-06-2026 - 3:00 IST -
#Speed News
Rains : వారం రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎమ్‌డీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ శనివారం వరకు అమల్లో ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌తో […]
Date : 21-06-2026 - 11:03 IST -
#Speed News
Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర్వాత అతని నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఆ రోజు తాను ఒక బేకరీ […]
Date : 19-06-2026 - 5:25 IST -
#Telangana
TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
తెలంగాణలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ టీజీ ఎప్‌సెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19వ తేదీ శుక్రవారం అంటే ఈరోజు నుంచే అధికారికంగా ప్రారంభమైంది. ఇంజినీరింగ్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి అర్హత సాధించిన 1,44,704 మంది విద్యార్థుల కోసం […]
Date : 19-06-2026 - 10:14 IST -
#Telangana
LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్
తెలంగాణలోని ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు (జూన్ 30) లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో కోత విధించనున్నారు. గత ఏడాది కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ, ఇంకా చాలా మంది వినియోగదారులు దీనిని పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం ఈసారి తుది గడువును విధిస్తూ కఠిన […]
Date : 17-06-2026 - 1:23 IST -
#Telangana
Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, జనసేన మధ్య నెలకొన్న వివాదం చల్లారడం లేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్, జనసేన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో బుధవారం రోజున పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. అరుదైన […]
Date : 16-06-2026 - 4:36 IST -
#Special
Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ
తెలంగాణకు చెందిన సంజన రెడ్డి, తన గ్రామంలోని రైతులకు సాధికారత కల్పించేందుకు అమెరికాలోని ఐటీ ఉద్యోగాన్ని తిరస్కరించారు. ఆమె తనకున్న పరిజ్ఞానాన్ని పసుపు సాగు, అమ్మకాలను మెరుగుపరచడానికి ఉపయోగించారు. రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే ‘ఇందూరు ఫార్మ్స్’ను రెడ్డి స్థాపించారు. ఈ సంస్థ రైతులకు మెరుగైన రాబడిని, కొనుగోలుదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఇప్పుడు ఆమె ఇతర పంటల వైపు కూడా విస్తరించాలని యోచిస్తున్నారు. సంజన రెడ్డికి అమెరికాలో చదువుకుని, అక్కడే ఒక సౌకర్యవంతమైన ఐటీ ఉద్యోగంలో […]
Date : 13-06-2026 - 1:40 IST