Telangana
-
#Telangana
Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్-1గా ప్రమోషన్లు
తెలంగాణ దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు ముగింపు లభించింది. శాఖను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రేడ్-2 కార్యనిర్వహణ అధికారులుగా విధుల్లో ఉన్న 26 మంది అధికారులకు గ్రేడ్-1 అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని, అర్హత సాధించిన ఈవోలకు పదోన్నతి నియామక పత్రాలను స్వయంగా […]
Date : 13-06-2026 - 9:55 IST -
#Telangana
Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ
ఖమ్మం నగరంలో గురువారం తెల్లవారుజామున ఒక భారీ చోరీ జరిగింది. నగరంలోని పాత కలెక్టరేట్ కార్యాలయం పక్కనే ఉన్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ షోరూం సోనోవిజన్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. కేవలం కొద్ది క్షణాల్లోనే చేతికి దొరికిన ఖరీదైన మొబైల్స్‌ను ఊడ్చేశారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ. 67 లక్షల విలువైన 160 స్మార్ట్‌ఫోన్లను దొంగిలించి.. సినీ ఫక్కీలో పారిపోయారు. దుకాణ సిబ్బంది ప్రాణాలకు తెగించి దొంగల కారును అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా […]
Date : 12-06-2026 - 11:30 IST -
#Telangana
Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర
కొన్ని చిన్న చిన్న విషయాలు ఇళ్లల్లో పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి గొడవలు చివరికి హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్లిన సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలు, తల్లీకుమార్తెలు, తండ్రి కొడుకుల మధ్య చిన్నగా మొదలైన మాటలు కాస్తా.. చివరికి ఎవరో ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంట్లో నాటుకోడి కూర వండాలనే విషయంలో జరిగిన ఘర్షణ చివరికి తండ్రిని కుమారుడు చంపే వరకు వెళ్లింది. తండ్రి […]
Date : 11-06-2026 - 4:57 IST -
#Telangana
Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల బీజేపీకి లాభం చేకూరదని భావిస్తున్న అధిష్ఠానం.. సొంతంగా ఎదగడంపై దృష్టి పెట్టింది. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ […]
Date : 10-06-2026 - 3:53 IST -
#Telangana
తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 14 వరకు తేలికపాటి వానలు […]
Date : 09-06-2026 - 9:11 IST -
#Telangana
KTR: పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ ఇక్కడున్న నాలుగు కోట్ల మంది భూమి పుత్రుల జాగీరని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అయితే, ఇక్కడికి ఎవరైనా రావొచ్చని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌లో సభ పెడతానంటే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’’ అంటూ మంగళవారం పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయవాదం.. […]
Date : 03-06-2026 - 12:52 IST -
#Speed News
JANASENA : పవన్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్.. ప్యాకేజీ ఇస్తే..?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై జడ్యర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ ఆయనకే మద్దతు ఇస్తారన్నారు. జైలులో చంద్రబాబు నాయుడును కలవడమే పవన్‌కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ అని అనిరుధ్ రెడ్డి అన్నారు.పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాను ఆశిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి తెలిపారు.తెలంగాణను విమర్శించే వ్యక్తి ఇక్కడికి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. సినీ […]
Date : 03-06-2026 - 9:04 IST -
#Telangana
Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్
తెలంగాణలో తనను అడుగుపెట్టనివ్వమని, తిరగనివ్వమని హెచ్చరికలు చేస్తున్న వారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ వారి అయ్య జాగీరా’ అంటూ మండిపడ్డారు. ఎవరు ఏం అన్నా తన గుండెల్లో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణపై తనకు ప్రేమ ఈ రోజు వచ్చిందని కాదు.. ఎప్పటినుంచో ఉందని తేల్చి చెప్పారు. రాజకీయ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైందని పేర్కొన్నారు. ఇక తాను చెరువులను కబ్జా చేసినట్లు చేసిన ఆరోపణలను కూడా […]
Date : 02-06-2026 - 5:35 IST -
#Speed News
JSP : హైదరాబాద్‌లో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారని అంచనా. అయితే, ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగర పోలీసులు అనుమతి నిరాకరించారు.దీంతో జనసేన […]
Date : 01-06-2026 - 7:53 IST -
#Telangana
Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన
తెలంగాణలో పగటిపూట తీవ్రమైన ఎండలు, సాయంత్రానికి అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తూ భిన్నమైన వాతావరణం నెలకొంది. జూన్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాల వల్ల కల్లాల్లోని ధాన్యం కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ ఏడాదే అత్యధికంగా వడగాల్పుల వల్ల మరణాలు సంభవించాయి. రుతుపవనాల రాకకు మరో పది రోజులకు పైగా […]
Date : 01-06-2026 - 9:39 IST -
#Speed News
Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీనటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు కొనసాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా వెళ్తున్న సందర్భంగా […]
Date : 31-05-2026 - 4:32 IST -
#Speed News
Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భవిత ” బంగారు భవిష్యత్ కోసం అండగా
మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక, ఉన్నత విద్య కోసం అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బంది పడుతున్న ప్రతిభావంతురాలైన విద్యార్థిని భవితకు ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని భవిత పదో తరగతిలో 600 మార్కులకు గాను 582 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. అలాగే పాలిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 634వ ర్యాంక్ సాధించింది. అయితే కుటుంబ ఆర్థిక […]
Date : 31-05-2026 - 8:26 IST -
#Speed News
TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచినట్లు జగ్గారెడ్డి తెలిపారు. పార్టీకి రాబోయే ఆరు నెలల నుంచి ఏడాది కాలం కీలకమని.. ఎన్నికల సంవత్సరం సమీపిస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తన భేటీ కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని, […]
Date : 31-05-2026 - 7:38 IST -
#Speed News
Road Accident : ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీలు కొట్టి హైవేపై ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న సర్వణకాంతి […]
Date : 30-05-2026 - 9:51 IST -
#Speed News
T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్రత్యేక తరగతులు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిర్వహించనున్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం టి-సాట్ ప్రత్యేక డిజిటల్ కంటెంట్‌ను అందించనుంది. ఈ విషయాన్ని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు, రైల్వే శాఖ ఇటీవల 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో సికింద్రాబాద్, ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్‌ల పరిధిలో 1,420 పోస్టులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు […]
Date : 30-05-2026 - 6:28 IST