ICC T20I rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో పటిష్టంగా రాణించి టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌కు చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ అందులో విఫలమయ్యాడు. సూర్యకుమార్ రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం ఓపెనర్ ట్రావిస్ హెడ్ మొదటి స్థానంలో ఉన్నాడు.
- By Praveen Aluthuru Published Date - 07:02 PM, Wed - 31 July 24

ICC T20I rankings: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు 3-0తో శ్రీలంకను ఓడించింది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ తొలి సిరీస్‌లో పటిష్ట ప్రదర్శన కనబరిచింది. తాజాగా బుధవారం విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఈ సిరీస్ విజయంతో ఆ జట్టు ఆటగాళ్లు సత్తా చాటారు. జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ పాకిస్థాన్ స్టార్ బ్యాటర్స్ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను అధిగమించాడు.
భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో పటిష్టంగా రాణించి ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌కు చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ అందులో విఫలమయ్యాడు. సూర్యకుమార్ రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం ఓపెనర్ ట్రావిస్ హెడ్ మొదటి స్థానంలో ఉన్నాడు.
శ్రీలంకతో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ 92 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. భారత యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ మూడు మ్యాచ్‌ల్లో 80 పరుగులు చేసి ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకాడు. యశస్వి రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ ప్లేయర్స్ బాబర్ ఆజం మరియు మహ్మద్ రిజ్వాన్ తమ ర్యాంకింగ్స్ లను కోల్పోయారు. బాబర్ ఒక స్థానం దిగజారి ఐదో స్థానానికి చేరుకున్నాడు. మహ్మద్ రిజ్వాన్ ఆరో స్థానంలో నిలిచాడు. భారత ఆటగాడు రితురాజ్ గైక్వాడ్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక పర్యటనకు టీ20 సిరీస్‌లో అతడిని ఎంపిక చేయలేదు. సూర్యకుమార్, యశస్వి, గైక్వాడ్ మినహా టాప్-10లో మరో భారతీయుడు లేడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ 16 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బౌలింగ్‌లో భారత ఆటగాడు రవి బిష్ణోయ్ కూడా టాప్-10లోకి ప్రవేశించాడు.
అయితే శ్రీలంక ఆటగాళ్లకు కూడా శుభవార్త అందింది. భారత్‌తో జరిగిన సిరీస్‌లో పటిష్ట ప్రదర్శన కనబరిచి అత్యధిక పరుగులు చేసిన పాతుమ్ నిస్సాంక 11 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. కుశాల్ పెరీరా 40 స్థానాలు ఎగబాకి 63వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
Also Read: Engine Oil : ఈ ఇంజిన్ ఆయిల్ ఉపయోగిస్తున్నారా.. ఇక మీ కార్ షెడ్డుకే..!