WTC 2025-27 Schedule: డబ్ల్యూటీసీ 2025-27 పూర్తి షెడ్యూల్ ఇదే.. 9 జట్లు మొత్తం 71 మ్యాచ్‌లు!
WTC 2025-27 షెడ్యూల్ ప్రకారం.. ఈ సమయంలో ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 22 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఇంగ్లాండ్ 21 మ్యాచ్‌లు ఆడుతుంది. రెండేళ్ల ఈ షెడ్యూల్‌లో భారత్ ఎప్పుడు, ఎవరితో టెస్ట్ సిరీస్ ఆడనుందో తెలుసుకుందాం.
- By Gopichand Published Date - 09:40 PM, Sun - 15 June 25

WTC 2025-27 Schedule: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 విజేత ఖరారైంది. WTC ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఫైనల్ ముగిసిన ఒక రోజు తర్వాత ICC WTC 2025-27 పూర్తి షెడ్యూల్‌ను (WTC 2025-27 Schedule) ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం 9 జట్లు మొత్తం 71 మ్యాచ్‌లు ఆడనున్నాయి. భారత జట్టు తమ WTC ప్రయాణాన్ని జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో ఆరంభిస్తుంది.
WTC 2025-27 షెడ్యూల్ ప్రకారం.. ఈ సమయంలో ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 22 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఇంగ్లాండ్ 21 మ్యాచ్‌లు ఆడుతుంది. రెండేళ్ల ఈ షెడ్యూల్‌లో భారత్ ఎప్పుడు, ఎవరితో టెస్ట్ సిరీస్ ఆడనుందో తెలుసుకుందాం.
Also Read: Plane Emergency Landing: విమానం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రయాణికులు ఏం చేయాలి?
India's 2025-2027 WTC Cycle Fixtures!
✈️ 5 Tests vs ENG, JUN – AUG 2025
🏠 2 Tests vs WI, OCT 2025
🏠 2 Tests vs SA, DEC 2025
✈️ 2 Tests vs SL, AUG 2026
✈️ 2 Tests vs NZ, OCT – DEC 2026
🏠 5 Tests vs AUS, JAN – FEB 2027📷 JioHotstar pic.twitter.com/C7FxwJl6zd
— CricketGully (@thecricketgully) May 24, 2025
భారత్ ఎప్పుడు, ఎవరితో సిరీస్ ఆడనుంది?
భారత జట్టు WTC 2025-27 సైకిల్‌లో మొత్తం 18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ప్రయాణం జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భారత్ సొంతగడ్డపై వెస్టిండీస్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సంవత్సరం చివరలో భారత్ దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ముగిస్తుంది. 2026లో భారత జట్టు WTCలో శ్రీలంక, న్యూజిలాండ్‌లతో వారి సొంత మైదానాల్లో ఆడనుంది. ఇక WTC సైకిల్‌లో చివరి సిరీస్‌ను భారత్ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఆడనుంది.
భారత్ 2025-2027 WTC సైకిల్ పూర్తి షెడ్యూల్
- 5 టెస్ట్‌లు vs ఇంగ్లాండ్, జూన్ – ఆగస్ట్ 2025 (విదేశాల్లో)
- మొదటి టెస్ట్: జూన్ 20, హెడింగ్లీ, లీడ్స్
- రెండవ టెస్ట్: జూలై 2, ఎడ్జ్‌బాస్టన్
- మూడవ టెస్ట్: జూలై 10, లార్డ్స్
- నాల్గవ టెస్ట్: జూలై 23-27, ఓల్డ్ ట్రాఫోర్డ్
- ఐదవ టెస్ట్: జూలై 31 – ఆగస్ట్ 4, ది ఓవల్
- 2 టెస్ట్‌లు vs వెస్టిండీస్, అక్టోబర్ 2025 (స్వదేశంలో)
- స్థలాలు: అహ్మదాబాద్, కోల్‌కతా
- 2 టెస్ట్‌లు vs దక్షిణాఫ్రికా, డిసెంబర్ 2025 (హోమ్)
- స్థలాలు: న్యూఢిల్లీ, గౌహతి
- 2 టెస్ట్‌లు vs శ్రీలంక, ఆగస్ట్ 2026 (విదేశాల్లో)
- 2 టెస్ట్‌లు vs న్యూజిలాండ్, అక్టోబర్ – డిసెంబర్ 2026 (విదేశాల్లో)
- 5 టెస్ట్‌లు vs ఆస్ట్రేలియా, జనవరి – ఫిబ్రవరి 2027 (హోమ్)