World Cup 2023 Points Table : ఆసీస్ కు ఘోర అవమానం.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం
వన్డే ప్రపంచ కప్ (World Cup)లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఇంకా ఖాతాని తెరవలేదు. ఆడిన రెండు మ్యాచ్ లూ ఓడిపోయింది.
- By Naresh Kumar Published Date - 12:20 PM, Mon - 16 October 23
World Cup 2023 Points Table : వన్డే ప్రపంచ కప్ లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఇంకా ఖాతాని తెరవలేదు. ఆడిన రెండు మ్యాచ్ లూ ఓడిపోయింది. అవమానకర విషయం ఏమిటంటే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు చిట్టచివరి స్థానంలో నిలిచింది. చివరికి ఆఫ్గనిస్తాన్ కూడా ఇంగ్లాండ్ ను ఓడించి రెండు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా తరహాలోనే రెండు మ్యాచ్ లు ఓడిన శ్రీలంక , నెదర్లాండ్స్ కూడా ఆసీస్ కంటే పైనే ఉన్నాయి. ఎందుకంటే రన్ రేట్ విషయంలోనూ కంగారూలు వెనుకబడి పోయారు. అందుకే పాయింట్ల పట్టికలో చివరి ప్లేస్ లో ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
పాయింట్ల పట్టికలో (World Cup 2023 Points Table) భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా మూడు మ్యాచ్‌లలో ఆరు పాయింట్లు సాధించి +1.821తో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ కూడా మూడు మ్యాచులు గెలిచి ఆరు పాయింట్లతో +1.604 రన్ రేట్ తో రెండవ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించి +2.360 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో ఉంది.
పాకిస్థాన్.. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌పై ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓటములు, ఒక విజయంతో 5వ స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్థాన్ ఇంగ్లండ్‌పై విజయంతో ఆరో స్థానానికి ఎగబాకింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య ఇవాళ కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడి బోణీ చేయని ఈ రెండు టీమ్స్ లో ఏదో ఒకటి ఇవాళ పాయింట్ల (World Cup 2023 Points Table) ఖాతా తెరవబోతోంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లను ఆడిన ఆసీస్.. ఇంకా తన ఖాతాను కూడా తెరవలేదు. ఆసీస్ జట్టు భారత్, దక్షిణాఫ్రికా చేతుల్లో పరాజయం పాలయింది.
భారత్ పై కేవలం 199 పరుగులకే చేతులెత్తేయగా.. తర్వాత సౌతాఫ్రికాపై మరీ దారుణంగా 177 రన్స్ కే కుప్పకూలింది. వార్నర్, స్మిత్, లబుషేన్, మార్ష్, మ్యాక్స్‌వెల్ లతో కూడిన బలమైన బ్యాటింగ్ లైనప్ అంచనాలకు తగ్గట్టు రాణించడం లేదు. బౌలింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్ లో సత్తా చాటాలి. అటు శ్రీలంక కూడా ఇదే పరిస్థితిలో ఉన్నప్పటికీ బ్యాటింగ్ పరంగా ఆసీస్ కంటే మెరుగ్గానే ఆడుతోంది.
Also Read: World Cup 2023: ప్రపంచకప్ లో ఆఫ్గనిస్తాన్ రికార్డ్స్
Related News
Gautam Gambhir: భారత్ జట్టు కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్..?
భారత జట్టుకు కొత్త కోచ్‌ని తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది బీసీసీఐ. తాజాగా న్యూజిలాండ్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం వచ్చింది.