World Cup 2023: ప్రపంచకప్ లో ఆఫ్గనిస్తాన్ రికార్డ్స్
ప్రపంచకప్ 13వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో ఆఫ్ఘనిస్థాన్ తలపడింది. ఢిల్లీ వేదికగా జరుగినఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 284 పరుగులు చేసింది.
- Author : Praveen Aluthuru
Date : 16-10-2023 - 8:57 IST
Published By : Hashtagu Telugu Desk
World Cup 2023: ప్రపంచకప్ 13వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో ఆఫ్ఘనిస్థాన్ తలపడింది. ఢిల్లీ వేదికగా జరుగినఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 284 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రెహ్మానుల్లా గుర్బాజ్ మరియు జద్రాన్ జట్టుకు ఘనమైన ప్రారంభాన్ని అందించారు. వీరిద్దరి మధ్య 114 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదైంది. అలాగే వీరిద్దరూ తొలి పవర్‌ప్లేలో 79 పరుగులు జోడించారు. ఇది ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు తొలి పవర్‌ప్లే అత్యధిక స్కోరుగా నిలిచింది. ఇది కాకుండా ఇక్రమ్ అలీఖిల్ ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు రెండవసారి 50 ప్లస్ స్కోర్ చేశాడు. ఆఫ్గనిస్తాన్ 2019లో వెస్టిండీస్ పై 288 స్కోర్ చేసింది. 2023 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పై 284 పరుగులు రాబట్టింది. ఢిల్లీ వేదికగా భారత్ పై 272 స్కోర్ చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ తన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి మూడో మ్యాచ్ లో పటిష్టమైన ఇంగ్లాండ్ పై భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీలోనే ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. అదే సమయంలో ఇంగ్లాండ్ తన మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓడిపోగా, రెండో మ్యాచ్‌లో గెలిచింది. మూడో మ్యాచ్ లో ఆఫ్ఘన్ పై ఓడింది.
అఫ్గానిస్తాన్ జట్టు:
రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహిం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నమీ, ఇక్రమ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫరూఖీ
ఇంగ్లండ్ జట్టు:
జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జాస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, స్యామ్ కరణ్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లీ
Also Read: Afghanistan Win: వరల్డ్‌కప్‌లో సంచలనం.. ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆప్ఘనిస్తాన్