Women’s IPL Preview: ఇక అమ్మాయిల ధనాధన్
- By Naresh Kumar Published Date - 11:07 AM, Sat - 4 March 23

భారత మహిళల క్రికెట్ (Indian Women Cricket) లో సరికొత్త శకం.. ఎప్పటి నుంచో ఎదరుచూస్తున్న మహిళల ఐపీఎల్ (Women’s IPL) కు నేటి నుంచే తెరలేవనుంది. ముంబై వేదికగా వుమెన్స్ ఐపీఎల్ (Women’s IPL) ఆరంభ మ్యాచ్ లో గుజరాత్ , ముంబై తలపడనున్నాయి. ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపింటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. గత అయిదేళ్లుగా మహిళల క్రికెట్ లో భారత జట్టు నిలకడగా రాణిస్తుంది. ముఖ్యంగా 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో దేశంలో అమ్మాయిల క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. 2020 టీ20 ప్రపంచకప్ ఫైనల్, నిరుడు కామన్వెల్త్ క్రీడల్లో రజతం, ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్ విజయంతో మహిళల క్రికెట్‌ను మరో మెట్టు ఎక్కించాయి. ఇప్పుడీ లీగ్‌తో అమ్మాయిల క్రికెట్ మరోస్థాయికి చేరుతుందని చెప్పొచ్చు.
జాతీయ జట్టులో అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న యువ క్రికెటర్లకు, జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలకూ ఈ లీగ్ ఉపయోగపడుతుంది. బీసీసీఐ మహిళల క్రికెట్ ను టేకోవర్ చేసిన తర్వాత ఆర్థికంగా ప్రోత్సాహం బాగానే లభిస్తోంది. ఇప్పుడు వుమెన్స్ ఐపీఎల్ (Women’s IPL) తో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చనే నమ్మకం అమ్మాయిల్లో పెరుగుతుంది. లీగ్‌లో రాణిస్తే జాతీయ జట్టులో చోటుతో పాటు జీవితంలోనూ కుదురుకునేందుకు అవకాశాలుంటాయి. ఇదిలా ఉంటే లీగ్ ప్రకటన చేసినప్పటి నుంచీ మీడియా ప్రసార హక్కులు , ఫ్రాంచైజీల అమ్మకం, క్రికెటర్ల వేలం ఇలా అన్నిట్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.
వేలంలో స్టార్ క్రికెటర్లపై రూ.కోట్ల వర్షం కురిసింది. ఇప్పుడీ సీజన్‌లో అదరగొట్టే అమ్మయిలకు తర్వాతి వేలంలో మంచి డిమాండ్ ఉంటుంది. కాగా మెగాటోర్నీల్లో విఫలమవుతున్న భారత ప్లేయర్లకు ఈ లీగ్ ఎంతగానో ఉపకరించనుంది. అంతర్జాతీయ ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంతో పాటు.. హోరాహోరీ పోరాటాలతో మనవాళ్లు మరింత రాటుదేలడం ఖాయమని చెప్పొచ్చు. తొలి సీజన్‌లో భాగంగా అన్నీ మ్యాచ్‌లు ముంబైలోనే నిర్వహించనున్నారు. మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 నుంచి ప్రారంభం కానుండగా.. శనివారం సాయంత్రం 5.30 నుంచే ఆరంభ వేడుకలు జరుగుతాయి. డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ సందడి చేయనున్నారు.

Related News

World Cup 2023: పాక్ కోసం బాంగ్లాదేశ్ లో ప్రపంచ కప్ మ్యాచ్ లు.. ఇది నిజమేనా..?
భారత్-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న రాజకీయ వాతావరణం కారణంగా క్రికెట్‌పై భారం పడుతోంది. ఇప్పటికే ఆసియా కప్ విషయంలో ఇరు దేశాల మధ్య పోరు సాగుతుండగా.. ఇప్పుడు 50 ఓవర్ల ప్రపంచకప్ (World Cup 2023)పై వచ్చిన వార్త క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.