India Playing XI: ఇంగ్లాండ్‌తో టీమిండియా తొలి టెస్టు.. భారత జట్టు ఇదే!
ఇంగ్లాండ్‌లో జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో లేదా ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది.
- By Gopichand Published Date - 06:55 PM, Sun - 15 June 25

India Playing XI: భారత్- ఇంగ్లాండ్ మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనున్నారు. రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ 20 నుంచి హెడింగ్లీలోని లీడ్స్‌లో జరగనుంది. BCCI ఐదు టెస్ట్ మ్యాచ్‌ల కోసం టీమ్ ఇండియాను ప్రకటించింది. అయితే ఇంగ్లాండ్ ఇప్పటివరకు మొదటి టెస్ట్ కోసం మాత్రమే జట్టును (India Playing XI) ప్రకటించింది. మొదటి టెస్ట్‌లో భారత్ జట్టు ఎలా ఉండవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
సాయి సుదర్శన్‌కు డెబ్యూ కోసం వేచి చూడాల్సిందే?
ఇంగ్లాండ్‌లో జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో లేదా ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది. సాయి సుదర్శన్‌కు టెస్ట్ డెబ్యూ కోసం వేచి చూడాల్సి ఉంటుంది. కెఎల్ రాహుల్‌తో పాటు యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు.
Also Read: Australian Players: టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్న ఆసీస్ కీలక ఆటగాళ్లు?!
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అతను గతంలో కూడా ఈ స్థానంలోనే ఆడాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ స్థానంలో నాల్గవ స్థానంలో కరుణ్ నాయర్ ఆడే అవకాశం ఉంది. అతను అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దీంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ అతన్ని బెంచ్‌పై ఉంచే తప్పు చేయరు. మిడిల్ ఆర్డర్‌లో ఐదవ స్థానంలో వైస్-కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ఆడతాడు. ఆ తర్వాత ఆరవ స్థానంలో నీతిష్ కుమార్ రెడ్డి, ఏడవ స్థానంలో రవీంద్ర జడేజా కూడా ఆడనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ యాక్షన్‌లో కనిపిస్తాడు. పేస్ బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉంటారు. అయితే, అర్ష్‌దీప్ సింగ్ రూపంలో ఒక లెఫ్ట్-హ్యాండ్ పేసర్ ఆప్షన్ కూడా ఉంది. కానీ మొదటి టెస్ట్‌లో ప్రసిద్ధ్ కృష్ణపై నమ్మకం పెట్టవచ్చు.
తొలి టెస్టుకు భారత్ జట్టు (అంచనా)
కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), నీతిష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.