Wicket-Keeper: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరో..? అందరి చూపు ఈ ఆటగాళ్ల పైనే..!
మెగా టోర్నీ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కాగా ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. ప్రపంచకప్‌కు ముందు టీమిండియా వికెట్ కీపర్ (Wicket-Keeper) విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంది.
- Author : Gopichand
Date : 18-07-2023 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
Wicket-keeper: వన్డే ప్రపంచకప్ 2023 భారత్‌లో జరగనుంది. మెగా టోర్నీ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కాగా ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. ప్రపంచకప్‌కు ముందు టీమిండియా వికెట్ కీపర్ (Wicket-Keeper) విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంది. గాయపడిన రిషబ్ పంత్ వలన టీమ్ ఇండియా కష్టాలు తగ్గడం లేదు. అయితే ఈ మెగా టోర్నీకి వికెట్ కీపర్‌గా జట్టుకు ఎలాంటి ఎంపికలు ఉన్నాయో తెలుసుకుందాం..!
రిషబ్ పంత్ డిసెంబర్ 30, 2022న జరిగిన ఘోర కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదం తరువాత పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే అతను పూర్తి ఫిట్‌నెస్ పొందడానికి చాలా సమయం పట్టేలా ఉంది. అదే సమయంలో, పంత్ ఎప్పుడు మైదానంలోకి వస్తాడనే దానిపై అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.
ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఇక్కడ టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. భారత్ నుంచి తొలి టెస్టులో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా అరంగేట్రం చేశాడు. అదే సమయంలో ఇషాన్ మార్చి 2021లో వైట్ బాల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున 14 వన్డేలు, 27 టీ20లు ఆడాడు. ఇషాన్ చాలా దూకుడుగా ఉండే బ్యాట్స్‌మెన్. వన్డేల్లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎంపిక కావచ్చు.
Also Read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారులో 5 కొత్త ఫీచర్లు.. అవేంటో తెలుసా..?
అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ వెస్టిండీస్ పర్యటనలో ఆడే వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టులో భాగమయ్యాడు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంజూ ఇప్పటి వరకు 11 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. వన్డేల్లో 330 పరుగులు, టీ20ల్లో 301 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా శాంసన్ అద్భుతంగా చేయగలడు.
ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌లతో పాటు టీమ్ ఇండియాలో కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. అయినప్పటికీ, రాహుల్ గాయం నుండి ఇంకా కోలుకుంటున్నప్పటికీ అతను నెట్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ప్రపంచకప్ లోపు జట్టులోకి పునరాగమనం చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఇద్దరిలోనూ రాహుల్ అత్యంత అనుభవం ఉన్న ఆటగాడు. అతను భారత్ తరఫున మూడు ఫార్మాట్‌లు ఆడతాడు. రాహుల్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 47 టెస్టులు, 54 వన్డేలు, 72 టీ20 ఇంటర్నేషనల్‌లు ఆడాడు.