White Pigeons: కోహ్లీకి వీడ్కోలు పలికిన పావురాలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
మే 12న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడకుండానే టెస్ట్‌కు వీడ్కోలు పలకడంతో చాలా మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకే అభిమానులు ఒక ప్లాన్ వేసుకున్నారు.
- Author : Gopichand
Date : 18-05-2025 - 9:36 IST
Published By : Hashtagu Telugu Desk
White Pigeons: బెంగళూరులో శనివారం భారీ వర్షం కారణంగా ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రద్దయింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ రేసు నుంచి బయటకు వెళ్లగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది. విరాట్ కోహ్లీకి వీడ్కోలు పలికేందుకు అభిమానులు ఈ మ్యాచ్‌ను చూసేందుకు తెల్ల జెర్సీలు ధరించి వచ్చారు. కానీ ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో వారు నిరాశకు గురయ్యారు. వర్షం సమయంలో ఆకాశంలో ఒక దృశ్యం (White Pigeons) కనిపించింది. దాన్ని చూసి అభిమానులందరూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.
మే 12న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడకుండానే టెస్ట్‌కు వీడ్కోలు పలకడంతో చాలా మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకే అభిమానులు ఒక ప్లాన్ వేసుకున్నారు. RCB తదుపరి మ్యాచ్‌లో కోహ్లీకి వీడ్కోలు చెప్పేందుకు అందరూ తెల్ల జెర్సీలు ధరించి స్టేడియానికి వచ్చారు. చిన్నస్వామి స్టేడియం వెలుపల కూడా కోహ్లీ పేరు రాసిన తెల్ల జెర్సీలు అమ్ముడయ్యాయి. అభిమానులు శనివారం తెల్ల జెర్సీలు ధరించి స్టేడియంలో కనిపించారు. కానీ దురదృష్టవశాత్తూ వారు తమ ఇష్టమైన ఆటగాడిని ఆడుతుండగా చూడలేకపోయారు.
Also Read: RCB vs KKR: కేకేఆర్ కొంపముంచిన వర్షం.. బెంగళూరు- కోల్‌కతా మ్యాచ్ రద్దు!
White pigeons group above the Chinnaswamy Stadium. 🕊️pic.twitter.com/3kJAmbFoku
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 17, 2025
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిని పావురాల వీడియో
వర్షం మధ్యలో చిన్నస్వామి స్టేడియం పైన తెల్ల పావురాల గుంపు ఎగురుతూ కనిపించింది. అవి స్టేడియం చుట్టూ తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అభిమానులు “చూడండి.. ఈ తెల్ల పక్షులు కూడా కోహ్లీ కోసం స్టేడియానికి వచ్చాయి” అని అనడం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
RCB ప్లేఆఫ్‌కు చేరిందా?
KKRతో రద్దైన మ్యాచ్ తర్వాత RCBకి కూడా 1 పాయింట్ లభించింది. దీంతో ఆర్సీబీ 17 పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది. కానీ ఇంకా ప్లేఆఫ్ స్థానం ఖరారు కాలేదు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్‌ను ఓడిస్తే లేదా గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడిస్తే RCB ప్లేఆఫ్ స్థానం ఖరారవుతుంది. లేకపోతే బెంగళూరు తమ తదుపరి మ్యాచ్‌ను గెలిచి ప్లేఆఫ్ టికెట్‌ను ఖరారు చేసుకోవచ్చు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం RCB తరపున అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్‌మన్. అతను 11 మ్యాచ్‌లలో 505 రన్స్ సాధించాడు. ఇక ఆరెంజ్ క్యాప్ హోల్డర్ సూర్యకుమార్ యాదవ్ అతని కంటే కేవలం 5 రన్స్ మాత్రమే ముందున్నాడు.