Narendra Modi Stadium: నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా రికార్డు ఎలా ఉంది?
మొత్తం ఈ స్టేడియంలో ఇప్పటివరకు 20 వన్డే మ్యాచ్‌లు ఆడింది. అందులో 11 గెలిచి 9 ఓడిపోయింది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది కూడా ఇదే మైదానంలో.
- By Naresh Kumar Published Date - 06:14 PM, Tue - 11 February 25

Narendra Modi Stadium: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని మూడో మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది, దీని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఈ పరిస్థితిలో ఇరు జట్లు బాగా రాణించి విజయం నమోదు చేయాలని కోరుకుంటాయి. మరి నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు ఎన్ని వన్డే మ్యాచ్‌లు ఆడింది, ఎన్ని మ్యాచ్‌లు గెలిచిందో చూద్దాం.
1984లో టీమిండియా అహ్మదాబాద్‌లోని స్టేడియంలో (Narendra Modi Stadium) తొలి వన్డే మ్యాచ్ ఆడింది. చివరి మ్యాచ్ 2023లో ఆడింది. మొత్తం ఈ స్టేడియంలో ఇప్పటివరకు 20 వన్డే మ్యాచ్‌లు ఆడింది. అందులో 11 గెలిచి 9 ఓడిపోయింది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది కూడా ఇదే మైదానంలో. అయితే గత ఐదు వన్డేలను పరిశీలిస్తే టీమిండియా ఇక్కడ నాలుగు సార్లు గెలిచింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత జట్టు 2-0 ఆధిక్యంలో ఉంది. కాగా సిరీస్‌లోని మూడో మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్‌లో జరుగుతుంది. రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డును పరిశీలిస్తే అక్కడ టీమిండియాదే ఆధిపత్యం కనిపిస్తుంది.
టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య 108 వన్డే మ్యాచ్‌లు జరగగా, టీం ఇండియా 59 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఇంగ్లాండ్ 44 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. 2 మ్యాచ్‌లు టై అయ్యాయి. కాగా ఇప్పుడు ఇరు జట్ల మధ్య 109వ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచినా, ఓడినా భారత్ కు పెద్దగా నష్టం జరిగేదేమి లేదు. అయితే సిరీస్ లో క్లీన్ స్వీప్ కాకుండా పరువు కాపాడుకోవాలంటే ఇంగ్లాండ్ మూడో వన్డేలోనైనా గెలవాల్సిన అవసరం ఉంది.
Also Read: Bhatti Good News: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి!
ఇంగ్లాండ్ జట్టు: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడాన్ కార్స్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్
భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్